Breaking News

IPL 2024: సీఎస్‌కేకు బిగ్‌ షాక్‌.. సీజన్‌ మొత్తానికి దూరమైన స్టార్‌ ప్లేయర్‌

Published on Thu, 04/18/2024 - 14:14

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు భారీ షాక్‌ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆ జట్టు స్టార్‌ ఓపెనర్‌, న్యూజిలాండ్‌ ఆటగాడు డెవాన్‌ కాన్వే సీజన్‌ మొత్తానికే దూరమయ్యాడు. గాయం కారణంగా సీజన్‌ తొలి ఆరు మ్యాచ్‌లకు దూరమైన కాన్వే.. ఇప్పుడు సీజన్‌ మొత్తానికే దూరం కావడం ఆ జట్టుపై పెను ప్రభావం పడనుంది.

కాన్వే గత రెండు సీజన్లుగా సీఎస్‌కేలో కీలక ఆటగాడిగా ఉన్నాడు. సీఎస్‌కే మరో టైటిల్‌ దిశగా అడుగులు వేసే క్రమంలో కాన్వే లాంటి ఆటగాడు అందుబాటు లేకపోవడం ఆ జట్టు విజయావకాశాలను బాగా దెబ్బతీస్తుంది. కాన్వే సీజన్‌ మొత్తానికి దూరమైన విషయాన్ని సీఎస్‌కే యాజమాన్యం ఇవాళ (ఏప్రిల్‌ 18) అధికారికంగా ప్రకటించింది. కాన్వేకు ప్రత్యామ్నాయంగా ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ రిచర్డ్‌ గ్లీసన్‌ను ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించింది. గ్లీసన్‌ను సీఎస్‌కే కనీస ధర 50 లక్షలకు సొంతం చేసుకుంది. 

కాగా, సీఎస్‌కే ప్రస్తుత సీజన్‌లో 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. కొత్త సారధి రుతురాజ్‌ సారధ్యంలో సీఎస్‌కే గత రెండు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించింది. ఈ జట్టు రేపు (ఏప్రిల్‌ 19) జరుగబోయే తమ తదుపరి మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ సీజన్‌లో సీఎస్‌కే ఇంకా ఎనిమిది మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మరో నాలుగు మ్యాచ్‌లు గెలిస్తే సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)