Breaking News

ఐపీఎల్‌-2024కు ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బిగ్‌ షాక్‌..

Published on Thu, 11/23/2023 - 21:31

ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్‌, ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ రాబోయే ఐపీఎల్‌ ఎడిషన్‌ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ అధికారికంగా దృవీకరించింది. ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వర్క్‌లోడ్‌, ఫిట్‌నెస్‌ దృష్ట్యా ఐపీఎల్‌-2024 అందుబాటులో లేడు.

ఐపీఎల్‌కు ముందు భారత్‌తో టెస్టు సిరీస్‌, టీ 20 ప్రపంచకప్‌తో తన పనిభారాన్ని దృష్టిలో పెట్టుకుని స్టోక్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. బెన్‌కు చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ ఎప్పుడు మద్దతుగా ఉంటుంది అని సీఎస్‌కే ఫ్రాంచైజీ ఓ ప్రకటనలో పేర్కొంది. 

కాగా బెన్‌ స్టోక్స్‌ గత కాలంగా మోకాలి గాయంతో బాధపడతున్నాడు. ఈ క్రమంలో భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు తన మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకోనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడేందుకు ఇంగ్లండ్‌ జట్టు భారత్‌కు రానుంది. ఇక ఐపీఎల్‌-2023 సీజన్‌ వేలంలో సీఎస్‌కే అతడిని ఏకంగా రూ. 16.25 కోట్ల భారీ ధరకు కొనగోలు చేసింది. కానీ అతడు మోకాలి గాయం కారణంగా గత సీజన్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 
చదవండి: టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా కెప్టెన్‌గా అతడే ఉండాలి: గంభీర్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)