Breaking News

Viral Video: కన్నీటి పర్యంతమైన క్రిస్టియానో రొనాల్డో

Published on Sat, 06/01/2024 - 10:28

దిగ్గజ ఫుట్‌బాలర్‌, పోర్చుగల్‌ స్టార్‌, అల్‌ నసర్‌ క్లబ్‌ తురుపు ముక్క క్రిస్టియానో రొనాల్డో కన్నీటి పర్యంతమయ్యాడు. కింగ్‌ కప్‌ ఫైనల్లో తన జట్టు ఓటమిని జీర్ణించుకోలేని రొనాల్డో భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేక వెక్కివెక్కి ఏడ్చాడు.  సహచరులు ఎంత ఓదార్చే ప్రయత్నం చేసినా రొనాల్డో కన్నీళ్లు ఆగలేదు. మైదానంలో చాలా సేపు కూర్చుని బాధతో కృంగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట​ వైరలవుతున్నాయి. రొనాల్డో బాధను చూసి నెటిజన్లు సైతం భావోద్వేగాలకు లోనవుతున్నారు. ఆట పట్ల స్టార్‌ ఫుట్‌బాలర్‌కు ఉన్న కమిట్‌మెంట్‌కు జేజేలు పలుకుతున్నారు. దేశానికి ప్రాతినిథ్యం వహించినా.. క్లబ్‌ తరఫున ఆడినా రొనాల్డో ప్యాషన్‌ ఒకే తీరులో ఉంటుందని కితాబునిస్తున్నారు.

కాగా, సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నిన్న (మే 31) జరిగిన కింగ్‌ ఆఫ్‌ ఛాంపియన్‌ కప్‌ ఫైనల్లో రొనాల్డో ప్రాతినిథ్యం వహించిన అల్‌ నసర్‌ జట్టు.. చిరకాల ప్రత్యర్ది అల్‌ హిలాల్‌ చేతిలో ఓటమిపాలైంది. తొలుత ఈ మ్యాచ్‌ (ఎక్స్‌ట్రా సమయం తర్వాత)  1-1తో టై కాగా.. పెనాల్టీ షూటౌట్‌లో అల్‌ హిలాల్‌.. 5-4 తేడాతో అల్‌ నసర్‌పై పైచేయి సాధించి టైటిల్‌ ఎగరేసుకుపోయింది. నిర్ణీత సమయంలో అల్‌ హిలాల్‌ తరఫున అలెగ్జాండర్‌ మిత్రోవిచ్‌ (7వ నిమిషం).. ఆల్‌ నసర్‌ తరఫున అయ్మాన్‌ యాహ్యా (88వ నిమిషం) గోల్స్‌ చేశారు.

ఇదిలా ఉంటే, అల్‌ హిలాల్‌ జట్టు ఇటీవల ముగిసిన సౌదీ ప్రో లీగ్‌లో కనీవినీ ఎరుగని ప్రదర్శనలు చేసి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ ఎడిషన్‌లో అల్‌ హిలాల్‌ రికార్డు స్థాయిలో 34 మ్యాచ్‌ల్లో 31 విజయాలు సాధించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. క్లబ్‌ ఫుట్‌బాల్‌ చరిత్రలో ఏ జట్టు ఈ స్థాయి విజయాలు సాధించలేదు. ఈ లీగ్‌లో కూడా రొనాల్డో జట్టు అల్‌ నసర్‌ రన్నరప్‌తో సరిపెట్టకుంది. రొనాల్డో తదుపరి UEFA యూరో ఛాంపియన్‌షిప్‌ 2024లో  పాల్గొననున్నాడు. ఈ టోర్నీలో క్రిస్‌  తన జాతీయ జట్టైన పోర్చుగల్‌కు ప్రాతినిథ్యం వహిస్తాడు.

 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)