Breaking News

70 కోట్ల విలువైన కారు.. కొన్నాడా లేక గిఫ్ట్‌గా వచ్చిందా?

Published on Thu, 03/30/2023 - 12:24

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోకు కార్లంటే పిచ్చ క్రేజ్‌. తన గ్యారేజీలో ఉన్న కార్ల లెక్కకు కొదువే లేదు. అయితే తాజాగా దాదాపు రూ. 70 కోట్ల విలువైన బుగాట్టి కారులో రొనాల్డో చక్కర్లు కొట్టడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బుగాట్టి.. సెంటోదియాచీ పేరుతో లిమిటెడ్ ఎడిషన్ కారును మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీని ఖరీదు 80 లక్షల యూరోలు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.71 కోట్లు. 

తాజాగా ఖరీదైన బుగాట్టి కారులో తన పార్ట్‌నర్ జార్జినా రోడ్రిగ్స్ తో కలిసి రొనాల్డో రెస్టారెంట్‌కు వచ్చాడు. డిన్నర్‌ అనంతరం బయటికి వచ్చిన రొనాల్డో బుగాట్టి కారు ఎక్కడం చూసి స్థానిక అభిమానులు ఫోటోలు క్లిక్‌ మనిపించారు. ఒక వ్యక్తి ఇదంతా తన కెమెరాలో బంధించి వీడియోను షేర్‌ చేయగా దానికి రొనాల్డో రీట్వీట్‌ చేయడం విశేషం. గతేడాది ఇదే రెస్టారెంట్ బయట ఒక రోల్స్ రాయిస్ కారులో రొనాల్డో కనిపించాడు. ఆ కారును జార్జినానే రొనాల్డోకు క్రిస్మస్ గిఫ్ట్ గా ఇవ్వడం విశేషం. మరి ఖరీదైన బుగాట్టిని రొనాల్డో కొన్నాడా లేక గిఫ్ట్‌గా వచ్చిందా అని అభిమానులు కామెంట్‌ చేశారు.

2024 యురోపియన్ ఛాంపియన్‌షిప్‌ క్వాలిఫయింగ్ కోసం రొనాల్డో తన సొంతజట్టు పోర్చుగల్‌ తరపున ఆడుతున్నాడు. ఇక జట్టు తరపున తొలి రెండు మ్యాచ్‌లు కలిపి నాలుగు గోల్స్‌ చేసిన రొనాల్డో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. పోర్చుగల్ తన తర్వాతి రెండు క్వాలిఫయింగ్ మ్యాచ్ లను జూన్ లో ఆడనుంది. ప్రస్తుతం గ్రూప్ జేలో పోర్చుగల్ టాప్ లో ఉంది. ప్రస్తుతం హాలిడే మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తున్న రొనాల్డో ఏప్రిల్‌ మొదటివారంలో అల్-నసర్ క్లబ్‌తో కలవనున్నాడు. ఏప్రిల్ 5న అల్‌-నసర్‌ క్లబ్.. అల్ అదాలాతో జరిగే మ్యాచ్‌లో రొనాల్డో ఆడనున్నాడు. 

చదవండి: 'ఆడేది మెగాటోర్నీ.. అలా కుదరదు'; ప్లాన్‌ బెడిసికొట్టిందా?

హ్యాట్రిక్‌ గోల్స్‌తో రికార్డు.. సెంచరీ కొట్టిన మెస్సీ

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)