Breaking News

చ‌రిత్ర సృష్టించిన రొనాల్డో.. మెస్సీ రికార్డు బ్రేక్‌

Published on Mon, 12/29/2025 - 11:48

సౌదీ ప్రీమియర్ లీగ్‌లో అల్ అఖ్‌దూద్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-0 తేడాతో అల్-నస్ర్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌, అల్-నస్ర్ కెప్టెన్‌ క్రిస్టియానో రొనాల్డో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.  రొనాల్డోరెండు మెరుపు గోల్స్‌తో అల్-నస్ర్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.

ఈ ఫుట్‌బాల్ స్టార్ మ్యాచ్ 31వ నిమిషంలో ఒక గోల్ చేయగా.. ఫ‌స్ట్ హాఫ్ ఆఖ‌రిలో మరో అద్భుతమైన గోల్ వేశాడు. అత‌డితో పాటు జోవో ఫెలిక్స్ కూడా ఓ గోల్ సాధించాడు. ఈ విజ‌యంతో సౌదీ ప్రో లీగ్ చరిత్రలో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచిన మొదటి క్లబ్‌గా అల్-నస్ర్ రికార్డు సృష్టించింది.

అదేవిధంగా రొనాల్డో కూడా ఓ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. 202 ఏడాదిలో రొనాల్డో 40 గోల్స్‌ను పూర్తి చేసుకున్నాడు. ఒకే క్యాలెండ‌ర్ ఈయ‌ర్‌లో అత్య‌ధిక సార్లు నాల‌భైకి పైగా గోల్స్ సాధించిన ప్లేయ‌ర్‌గా రోనాల్డో చ‌రిత్ర సృష్టించాడు.  అతడు తన కెరీర్‌లో 14 వేర్వేరు సంవత్సరాల్లో 40 పైగా గోల్స్ సాధించాడు.

2010 నుంచి దాదాపు ప్రతీ ఏటా  రోనాల్డో నాలభైకి పైగా గోల్స్ సాధిస్తున్నాడు. ఒక్క 2019లోనే ఈ మార్క్‌ను అందుకోలేకపోయాడు. కాగా ఇంతకుముందు ఈ రికార్డు అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పేరిట ఉండేది. మెస్పీ తన కెరీర్‌లో ఇప్పటివరకు 13 సార్లు 40 పైగా గోల్స్ సాధించాడు. తాజా మ్యాచ్‌తో మెస్సీని రొనాల్డో అధిగమించాడు.
చదవండి: మ‌హ్మద్ ష‌మీకి బీసీసీఐ భారీ షాక్‌..!

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)