Breaking News

కుంబ్లేకి చెప్పి ఏడ్చాను.. అయినా పట్టించుకోలేదు.. అతడేమో...: గేల్‌

Published on Mon, 09/08/2025 - 14:55

వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం క్రిస్‌ గేల్‌ (Chris Gayle) ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings) గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను అగౌరవపరిచారని.. యాజమాన్యం వ్యవహారశైలి కారణంగా తాను డిప్రెషన్‌లో కూరుకుపోయే పరిస్థితి తలెత్తిందని తెలిపాడు. యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ 2008లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు.

2021లో ఐపీఎల్‌కు వీడ్కోలు..
క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో మొత్తంగా 142 మ్యాచ్‌లు ఆడిన క్రిస్‌ గేల్‌.. ఆరు శతకాల సాయంతో 4965 పరుగులు సాధించాడు. పంజాబ్‌ కింగ్స్‌ తరఫున తన చివరి మ్యాచ్‌ ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. 2021లో ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. పంజాబ్‌ ఫ్రాంఛైజీ (అప్పడు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌)కి 2018- 2021 వరకు ప్రాతినిథ్యం వహించిన గేల్‌.. మొత్తంగా ఆ జట్టు తరఫున 41 మ్యాచ్‌లు ఆడి 1304 పరుగులు చేశాడు.

ఇందులో ఓ సెంచరీ, పదకొండు అర్ధ శతకాలు కూడా ఉండటం విశేషం. ఇక పంజాబ్‌ తరఫున గేల్‌ అత్యధిక వ్యక్తిగత స్కోరు 104. అయితే, జట్టు కోసం ఇంతచేసినా.. ఫ్రాంఛైజీ మాత్రం తనకు కనీస మర్యాద ఇవ్వలేదని గేల్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

గౌరవం, మర్యాద ఇవ్వలేదు
‘‘పంజాబ్ ఫ్రాంఛైజీ కారణంగా నా ఐపీఎల్‌ కెరీర్‌ ముందుగానే ముగిసిపోయింది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టులో నన్ను అగౌరవపరిచారు. ఓ సీనియర్‌ ఆటగాడిగా నాకు ఇవ్వాల్సిన గౌరవం, మర్యాద ఇవ్వలేదు.

జట్టుతో పాటు లీగ్‌కు కూడా విలువ తెచ్చిన నాలాంటి ఆటగాడి పట్ల అలా ఎవరూ వ్యవహరించరు. నన్నో చిన్నపిల్లాడిలా చూశారు. వారి వైఖరి వల్ల.. జీవితంలో తొలిసారి నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది.

కుంబ్లేకి చెప్పి ఏడ్చాను.. అయినా పట్టించుకోలేదు
నా మనసు బాగా గాయపడింది. ఇదే విషయాన్ని అనిల్‌ కుంబ్లేకు చెప్పాను. అతడితో మాట్లాడుతూ గట్టిగా ఏడ్చేశాను. కానీ అతడు కూడా నన్ను పూర్తిగా నిరాశపరిచాడు. ఫ్రాంఛైజీని యాజమాన్యం నడిపిస్తున్న తీరు నన్ను నిరాశకు గురిచేసింది.

కేఎల్‌ రాహుల్‌ ఫోన్‌ చేసి..
అప్పటి కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ నాకు ఫోన్‌ చేసి.. ‘క్రిస్‌.. నువ్వు తదుపరి మ్యాచ్‌ ఆడబోతున్నావు’ అని చెప్పాడు. నేను మాత్రం.. ‘మీకు ఆల్‌ ది బెస్ట్‌’ అని చెప్పేసి బ్యాగ్‌ సర్దేసుకున్నాను. ఫ్రాంఛైజీ నుంచి బయటకు వచ్చేశాను’’ అని శుభంకర్‌ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో గేల్‌ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించాడు.

కాగా కేకేఆర్‌, పంజాబ్‌ జట్లతో పాటు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు కూడా గేల్‌ ప్రాతినిథ్యం వహించాడు. ఇటీవల ఫైనల్లో పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించి ఆర్సీబీ ట్రోఫీ గెలిచినప్పుడు విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌తో కలిసి మైదానమంతా కలియదిరుగుతూ సందడి చేశాడు. ఇదిలా ఉంటే.. పంజాబ్‌పైన గేల్‌​ 16 ఇన్నింగ్స్‌ ఆడి 797 పరుగులు చేయడం గమనార్హం.

చదవండి: సెలెక్టర్లకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన పాకిస్తాన్‌ కెప్టెన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)