Breaking News

డీఎస్పీగా నియామక పత్రాన్ని అందుకున్న క్రికెటర్‌ సిరాజ్‌

Published on Fri, 10/11/2024 - 18:12

టీమిండియా స్టార్‌ బౌలర్‌, హైదరాబాదీ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్‌ పోలీస్‌గా (డీఎస్పీ) నియామక పత్రాన్ని అందుకున్నారు. తెలంగాణ డీజీపీ జితేందర్‌ సిరాజ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిరాజ్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఉన్నారు.

టీ20 వరల్డ్‌కప్‌-2024 గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న సిరాజ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గ్రూప్‌-1 ఉద్యోగాన్ని ఆఫర్‌ చేసిన విషయం తెలిసిందే. సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగంతో పాటు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 78లో 600 చదరపు గజాల స్థలాన్ని కూడా కేటాయించారు. తనకు ఉద్యోగం ఇవ్వడంతో పాటు స్థలాన్ని కేటాయించిన తెలంగాణ ప్రభుత్వానికి సిరాజ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

30 ఏళ్ల సిరాజ్‌ 2017లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి టీమిండియా ఆల్‌ ఫార్మాట్‌ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. సిరాజ్‌ టీ20 వరల్డ్‌కప్‌-2024తో పాటు అంతకుముందు జరిగిన ఆసియా కప్‌లో విశేషంగా రాణించాడు. సిరాజ్‌ తన తండ్రి చనిపోయాడన్న వార్త తెలిసి కూడా ఆస్ట్రేలియాలో అద్భుతాలు చేశాడు.

సిరాజ్‌ ఇప్పటివరకు టీమిండియా తరఫున 28 టెస్ట్‌లు, 44 వన్డేలు, 16 టీ20లు ఆడాడు. ఇందులో 161 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్‌ అందరూ బౌలర్లలా కాకుండా ఆల్‌ ఫార్మాట్‌ బౌలర్‌గా రాటుదేలాడు. ఐపీఎల్‌ ద్వారా సిరాజ్‌ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. సిరాజ్‌ ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడతాడు. ఐపీఎల్‌లో అతను 93 మ్యాచ్‌లు ఆడి 93 వికెట్లు పడగొట్టాడు. 

చదవండి: చివరి స్థానానికి పడిపోయిన పాకిస్తాన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)