Breaking News

ఇండియా వర్సెస్‌ ఐర్లాండ్‌ టీ20 సిరీస్‌.. షెడ్యూల్‌ విడుదల

Published on Wed, 06/28/2023 - 12:27

3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం టీమిండియా ఐర్లాండ్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను క్రికెట్‌ ఐర్లాండ్‌ (సీఐ) నిన్న (జూన్‌ 27) విడుదల చేసింది. ఆగస్ట్‌ 18న తొలి టీ20, ఆగస్ట్‌ 20, ఆగస్ట్‌ 23 తేదీల్లో మిగతా రెండు టీ20లు జరుగుతాయని సీఐ సీఈఓ వెల్లడించాడు. ఈ మూడు మ్యాచ్‌లకు డబ్లిన్‌లోని మలహిదే గ్రౌండ్స్‌ వేదిక కానున్నాయని ఆయన తెలిపాడు. భారత్‌.. వెస్టిండీస్‌ పర్యటన ముగిసిన వెంటనే (ఆగస్ట్‌ 13) ఐర్లాండ్‌ సిరీస్‌ మొదలవుతుంది.

కాగా, టీమిండియా.. ఐర్లాండ్‌తో గతేడాది కూడా టీ20 సిరీస్‌ ఆడిన విషయం తెలిసిందే. నాటి సిరీస్‌ను హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలోనే టీమిండియా 2-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. 12 ఓవర్లకు కుదించిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో 4 పరుగుల స్వల్ప తేడాతో భారత్‌ గెలుపొందింది. రెండో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన దీపక్‌ హుడా (104)కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు లభించాయి.

అంతకుముందు 2018లో కూడా టీమిండియా ఐర్లాండ్‌లో పర్యటించింది. నాటి సిరీస్‌ను కూడా టీమిండియా 2-0 తేడాతో ఊడ్చేసింది. ఓవరాల్‌గా భారత్‌-ఐర్లాండ్‌ మధ్య ఇప్పటివరకు మొత్తం 5 మ్యాచ్‌లు జరగ్గా ఐదింటిలో టీమిండియానే గెలుపొందింది. 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)