Breaking News

'500వ మ్యాచ్.. నిబద్ధతకు సెల్యూట్‌ కొట్టాల్సిందే'

Published on Thu, 07/20/2023 - 09:02

టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి ఈతరం ఆల్‌టైమ్‌ గ్రేట్‌ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక వెస్టిండీస్‌తో నేటి నుంచి జరగనున్న రెండో టెస్టు కోహ్లికి అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు కలిపి 500వ మ్యాచ్‌. టీమిండియా తరపున 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న నాలుగో​ ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఇక అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లి ఆరో స్థానంలో ఉండగా.. సెంచరీల విషయంలో మాత్రం​ దిగ్గజం సచిన్‌ తర్వాతి స్థానంలో ఉన్నాడు.

విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేయడంలో విఫలమైనప్పటికి 76 పరుగులతో మంచి టచ్‌లోనే కనిపించాడు. మరి ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో కోహ్లి సెంచరీతో మెరుస్తాడేమో చూడాలి. ఇక కోహ్లి 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతుండడంపై టీమిండియా మాజీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీలు ఆకాశ్‌ చోప్రా, వసీం జాఫర్‌, ప్రగ్యాన్‌ ఓజాలు కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించారు.

''ఆట పట్ల కోహ్లికున్న నిబద్ధత ఇవాళ 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడేలా చేసింది. వచ్చి 16 ఏళ్లు కావొస్తున్నా అదే ఫిట్‌నెస్‌ మెయింటేన్‌ చేయడం అంటే మాములు విషయం కాదు. ఈ 16 ఏళ్లలో కోహ్లి తనకు తానుగా తప్పుకున్నాడే తప్ప ఫిట్‌నెస్‌ విషయంలో ఇబ్బంది పడి ఒక్క మ్యాచ్‌కు దూరమైన సందర్భాలు లేవు. ఈతరం క్రికెటర్లలో గొప్ప ఆటగాడని కచ్చితంగా చెప్పగలను. 500వ మ్యాచ్‌ ఆడుతున్న కోహ్లికి కంగ్రాట్స్‌'' అంటూ ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు.

''500వ అంతర్జాతీయ మ్యాచ్‌.. కోహ్లి ఖాతాలో మరో కలికితురాయి. ఇది నిజంగా గొప్ప అచీవ్‌మెంట్‌ అని చెప్పొచ్చు. కొందరికే ఇది సాధ్యమవుతుంది.. అందులో కోహ్లి ఒకడు. ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా'' అంటూ ఓజా పేర్కొన్నాడు.

''క్రికెట్‌లో 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం అందరికి రాదు. కానీ కోహ్లికి ఆ చాన్స్‌ వచ్చింది. బ్యాటర్‌గా తనేంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. మంచి ఫిట్‌నెస్‌ కలిగి ఉన్న కోహ్లి ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో 75 సెంచరీలు బాదాడు. ఇది అతని క్రమశిక్షణ, అంకితభావం,  సంకల్పాన్ని సూచిస్తున్నాయి.'' అంటూ జాఫర్‌ తెలిపాడు.

చదవండి: BAN W Vs IND W 2nd ODI: జెమీమా రోడ్రిగ్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన..108 పరుగులతో భారీ విజయం

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు