Breaking News

ప్రీతి జింటా జట్టుకు కొత్త కెప్టెన్‌

Published on Thu, 08/07/2025 - 10:23

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2025 సీజన్‌ ప్రారంభానికి ముందు సెయింట్‌ లూసియా కింగ్స్‌ కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసుకుంది. గత సీజన్‌లో కింగ్స్‌ను ఛాంపియన్‌గా నిలిపిన ఫాఫ్‌ డుప్లెసిస్‌ వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్‌ నుంచి తప్పుకున్నాడు. 

దీంతో కింగ్స్‌ మేనేజ్‌మెంట్‌ నమీబియా వెటరన్‌ ఆల్‌రౌండర్‌ డేవిడ్‌ వీస్‌ను కొత్త కెప్టెన్‌గా ప్రకటించింది. వీస్‌ 2021 ఎడిషన్‌ నుంచి కింగ్స్‌లో సభ్యుడిగా ఉన్నాడు. అతను ఈ ఫ్రాంచైజీ తరఫున 26 మ్యాచ్‌ల్లో 36 వికెట్లు తీసి, 338 పరుగులు చేశాడు.

ఈ సీజన్‌కు ముందు కింగ్స్‌ టిమ్‌ డేవిడ్‌, తబ్రేజ్‌ షంషి లాంటి స్టార్‌ ప్లేయర్లను రీటైన్‌ చేసుకుంది. అలాగే మీకా మెకెంజీ, జావెల్‌ గ్లెన్‌ లాంటి కొత్త ముఖాలను జట్టులో చేర్చుకుంది. గత సీజన్‌ ఫైనల్లో కింగ్స్‌ నాటి డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గయనా అమెజాన్‌ వారియర్స్‌ను మట్టికరిపించి ఛాంపియన్‌గా అవతరించింది.

ఈ సీజన్‌ సీపీఎల్‌ ఆగస్ట్‌ 14 నుంచి ప్రారంభం​ కానుంది. లూసియా కింగ్స్‌ ఆగస్ట్‌ 17న తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఆ మ్యాచ్‌లో కింగ్స్‌ ఆంటిగ్వా అండ్‌ బార్బుడా ఫాల్కన్స్‌తో తలపడనుంది.

కాగా, సెయింట్‌ లూసియా కింగ్స్‌ ఐపీఎల్‌ ఫ్రాంచైజీ అయిన పంజాబ్‌ కింగ్స్‌ యాజమాన్యం అండర్‌లో నడుస్తుంది. లూసియా కింగ్స్‌కు బాలీవుడ్‌ నటి ప్రీతి జింటా సహ యజమానిగా వ్యవహరిస్తుంది.

సెయింట్ లూసియా కింగ్స్ స్క్వాడ్‌ : టిమ్ డేవిడ్, అల్జరి జోసఫ్, జాన్సన్ చార్లెస్, టిమ్ సీఫెర్ట్, రోస్టన్ చేజ్, తబ్రైజ్ షంషి, డేవిడ్ వీస్ (కెప్టెన్‌), డెలానో పోట్గీటర్, మాథ్యూ ఫోర్డ్, ఆరోన్ జోన్స్, ఖారీ పియరీ, జావెల్లె గ్లెన్, మికా మెకెంజీ, షడ్రక్ డెస్కార్టే, జోహన్ జెరెమియా, కియోన్ గాస్టన్, అకీమ్ అగస్టే

 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)