Breaking News

పూరన్‌ సుడిగాలి శతకం

Published on Mon, 09/30/2024 - 08:39

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2024 చివరి లీగ్‌ దశ మ్యాచ్‌లో గయానా అమెజాన్‌ వారియర్స్‌పై ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ 74 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నైట్‌రైడర్స్‌ నికోలస్‌ పూరన్‌ సుడిగాలి శతకంతో (59 బంతుల్లో 101; 9 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. 

జేసన్‌ రాయ్‌ (26 బంతుల్లో 34), కీసీ కార్తీ (13 బంతుల్లో 27 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. పోలార్డ్‌ 19, రసెల్‌ 9, టిమ్‌ డేవిడ్‌, పార్రిస్‌ డకౌట్‌ అయ్యారు. వారియర్స్‌ బౌలర్లలో షమార్‌ జోసఫ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. ఇమ్రాన్‌ తాహిర్‌, ప్రిటోరియస్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

137 పరుగులకే కుప్పకూలిన వారియర్స్‌
212 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అమెజాన్‌ వారియర్స్‌ 137 పరుగులకే (18.5 ఓవర్లలో) కుప్పకూలింది. టెర్రన్స్‌ హిండ్స్‌, వకార్‌ సలాంకీల్‌, నాథన్‌ ఎడ్వర్డ్స్‌ తలో మూడు వికెట్లు తీసి వారియర్స్‌ను దెబ్బకొట్టారు. అకీల్‌ హొసేన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

వారియర్స్‌ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్బాజ్‌ (36), షాయ్‌ హోప్‌ (28), గుడకేశ్‌ మోటీ (26 నాటౌట్‌), ఇమ్రాన్‌ తాహిర్‌ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. హెట్‌మైర్‌ (9), కీమో పాల్‌ (1), మొయిన్‌ అలీ (5), రొమారియో షెపర్డ్‌ (0), ప్రిటోరియస్‌ (0) విఫలమయ్యారు.

ఈ మ్యాచ్‌ ఫలితంతో ఎలిమినేటర్‌, క్వాలిఫయర్‌-1లో తలపడబోయే జట్లేవో తేలిపోయాయి. అక్టోబర్‌ 1న జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ట్రిన్‌బ్రాగో నైట్‌రైడర్స్‌, బార్బడోస్‌ రాయల్స్‌ తలపడనుండగా.. అక్టోబర్‌ 2న జరిగే క్వాలిఫయర్‌-1లో గయానా అమెజాన్‌ వారియర్స్‌, సెయింట్‌ లూసియా కింగ్స్‌ పోటీ పడనున్నాయి. 

లీగ్‌ మ్యాచ్‌లన్నీ పూర్తయ్యాక గయానా అమెజాన్‌ వారియర్స్‌, సెయింట్‌ లూసియా కింగ్స్‌, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌, బార్బడోస్‌ రాయల్స్‌ పాయింట్ల పట్టికలో టాప్‌-4లో నిలిచాయి.

చదవండి: చెలరేగిన అదైర్‌ బ్రదర్స్‌.. సౌతాఫ్రికాపై ఐర్లాండ్‌ సంచలన విజయం

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)