ఇంగ్లండ్‌ గడ్డపై ఇరగదీస్తున్న చహల్‌.. తాజాగా మరో మ్యాచ్‌లో..!

Published on Wed, 09/18/2024 - 10:47

టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌ ఇంగ్లండ్‌ గడ్డపై ఇరగదీస్తున్నాడు. కౌంటీ క్రికెట్‌లో చహల్‌ చెలరేగిపోతున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న చహల్‌.. లీసెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో (తొలి ఇన్నింగ్స్‌లో) సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌కు ముందు డెర్బిషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లతో (తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన చహల్‌, సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో నాలుగు) మెరిశాడు.

అంతకుముందు ఇంగ్లండ్‌ వన్డే కప్‌లోనూ చహల్‌ చెలరేగాడు. నార్తంప్టన్‌షైర్‌ తరఫున తన తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఆ మ్యాచ్‌లో చహల్‌ తన కోటా 10 ఓవర్లలో ఐదు మెయిడిన్లు వేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చహల్‌ రాకతో నార్తంప్టన్‌షైర్‌ ఫేట్‌ మారిపోయింది. 

ఆ జట్టు వరుస విజయాలు సాధిస్తుంది. చహల్‌ నార్తంప్టన్‌షైర్‌ తరఫున ఫార్మాట్లకతీతంగా సత్తా చాటుతున్నాడు. కాగా, చహల్‌ టీమిండియా తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో ఇంగ్లండ్‌ కౌంటీల్లో ఆడుతున్న విషయం తెలిసిందే.

మ్యాచ్‌ విషయానికొస్తే.. కౌంటీ ఛాంపియన్‌షిప్‌ డివిజన్‌-2 మ్యాచ్‌ల్లో భాగంగా లీసస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నార్తంప్టన్‌షైర్‌ బౌలర్లు మూకుమ్మడిగా రాణించారు. చహల్‌తో పాటు రాబ్‌ కియోగ్‌ (3/20), జాక్‌ వైట్‌ (2/16), సాండర్‌సన్‌ (1/32) సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన లీసెస్టర్‌షైర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 203 పరుగులకు ఆలౌటైంది. 

లీసెస్టర్‌ ఇన్నింగ్స్‌లో బుడింగర్‌ (56) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. హిల్‌ (32), రెహాన్‌ అహ్మద్‌ (30) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన నార్తంప్టన్‌షైర్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఆ జట్టు లీసెస్టర్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 69 పరుగులు వెనుకపడి ఉంది. 

చదవండి: భారత్‌పై అక్కసు తీర్చుకున్న పాక్‌ హాకీ జట్టు!

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)