Breaking News

కొత్త కారు కొన్న రోహిత్ శ‌ర్మ.. ఎన్ని కోట్లంటే?

Published on Mon, 08/11/2025 - 19:10

టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ గ్యారేజ్‌లో మరో కొత్త కారు వ‌చ్చి చేరింది. రోహిత్ ఎరుపు రంగు లాంబోర్గిని ఉరుస్ కారును కొనుగోలు చేశాడు. కొన్ని రోజుల క్రిత‌మే ఈ లగ్జ‌రీ కారు ముంబైలోని రోహిత్ ఇంటికి డెలివ‌రీ అయింది.

కాగా హిట్‌మ్యాన్ గ‌తంలో కూడా నీలం రంగు  లాంబోర్గిని ఉరుస్ కారు ఉండేది. అయితే ఆ కారును డ్రీమ్‌11 కాంటెస్ట్ విజేత‌కు అంద‌జేయ‌డంతో.. ఇప్పుడు కొత్త లాంబోర్గిని కొనుగోలు చేయాల్సి వ‌చ్చింది. ఈ కాస్ట్‌లీ కారుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి. 

ఈ క్ర‌మంలో అత‌డి కారు నంబ‌ర్ 3015ను అభిమానులు డీకోడ్‌ చేశారు. '3015' అనే సంఖ్య హిట్‌మ్యాన్ ఇద్దరు పిల్లల పుట్టినరోజులను సూచిస్తుంది. డిసెంబర్ 30 రోహిత్ కుమార్తె స‌మీరా బ‌ర్త్‌డే కాగా.. నవంబ‌ర్ 15 హిట్‌మ్యాన్ కొడుకు అహాన్ పుట్టిన రోజు.

అంతేకాకుండా మొత్తం అంకెల్‌ను క‌లిపితే రోహిత్ జెర్సీ నంబ‌ర్ 45 వ‌స్తోంది. రోహిత్ పాత కారుకు 264 నెంబ‌ర్ ఉండేది. ఆ నెంబ‌ర్ .. వ‌న్డేల్లో రోహిత్ చేసిన అత్య‌ధిక స్కోర్‌న్ సూచిస్తోంది. కాగా కొత్త ఉరుస్ ఎస్ఈ కారు ధ‌ర రూ. 4.57 కోట్ల‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఇక టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్‌ శర్మ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఈ ఏడాది నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో రోహిత్‌ను అభిమానులు భారత జెర్సీలో చూసే అవకాశముంది.
చదవండి: Mohammed Shami: ‘సెలక్టర్లు అతడిని తప్పించలేదు.. తనే తప్పుకొన్నాడు’
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)