Breaking News

టీమిండియా కొంప‌ముంచిన 22 ఏళ్ల కుర్రాడు..

Published on Fri, 10/24/2025 - 09:02

అడిలైడ్ వేదిక‌గా టీమిండియాతో జ‌రిగిన రెండో వ‌న్డేలో 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజ‌యం సాధించింది. 265 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆసీస్ 46.2 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి చేధించింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్‌ను మార్ష్ సేన మ‌రో మ్యాచ్ మిగిలూండ‌గానే 2-0తో సొంతం చేసుకుంది. కాగా ఆసీస్ విజ‌యంలో ఆ జ‌ట్టు యువ ఆట‌గాడు కూపర్ కొన్నోలీది కీల‌క పాత్ర‌.

ల‌క్ష్య చేధ‌న‌లో కొన్నోలీ అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. 132 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయిన స‌మంయ‌లో కంగారుల‌ను షార్ట్‌తో క‌లిసి కూప‌ర్ ఆదుకున్నాడు. షార్ట్ ఔట‌య్యాక కూడా 22 ఏళ్ల యువ సంచ‌ల‌నం ఏ మాత్రం ఒత్త‌డికి లోన‌వ్వ‌కుండా జ‌ట్టును గెలుపు దిశ‌గా న‌డిపించాడు. ఆఖ‌రిలో 14 పరుగుల వ్యవధిలో ఆసీస్‌ 3 వికెట్లు కోల్పోవడంతో ఉత్కంఠ పెరిగింది. 

కానీ కనోలీ ప్రశాంతంగా ఉండి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. మొత్తంగా 53 బంతులు ఎదుర్కొన్న కొన్నోలీ.. 5 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 61 ప‌రుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఒక‌వేళ కొన్నోలీ వికెట్‌ను టీమిండియా సాధించి ఉంటే క‌థ మ‌రో విధంగా ఉండేది. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన కూప‌ర్‌పై స‌ర్వాత్ర ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఆసీస్ కెప్టెన్ మార్ష్ సైతం అత‌డిని పొగ‌డ్త‌లతో ముంచెత్తాడు.

కూపర్ ఒక అద్భుతం. అత‌డు బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణించ‌గ‌ల‌డు. ఈ మ్యాచ్‌లో అసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. అత‌డు వ‌య‌స్సు 22 ఏళ్లు మాత్ర‌మే. ఖ‌చ్చితంగా ఆసీస్ గొప్ప క్రికెట‌ర్ల‌లో ఒక‌డిగా ఎదుగుతాడ‌ని మార్ష్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేష‌న్‌లో పేర్కొన్నాడు. కొన్నోలీ ఇప్ప‌టికే మూడు ఫార్మాట్ల‌లో ఆసీస్ జ‌ట్టు త‌ర‌పున అరంగేట్రం చేశాడు.

అయితే ఈ మ్యాచ్‌ కంటే ముందు అతడు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో కూడా అతడు ఇప్పటివరకు కేవలం 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ బిగ్‌ బాష్‌ లీగ్‌లో మాత్రం అతడికి మంచి రి​కార్డు ఉంది.
చదవండి: IND vs AUS: అత‌డే ఉంటే కథ వేరేలా ఉండేది.. గంభీర్ ఇక‌నైనా మార‌వా?

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)