Breaking News

న్యూజిలాండ్‌ ఓపెనర్ల ప్రపంచ రికార్డు

Published on Sun, 12/21/2025 - 18:11

న్యూజిలాండ్‌ ఓపెనర్లు డెవాన్‌ కాన్వే, టామ్‌ లాథమ్‌ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఒకే టెస్ట్‌ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన తొలి ఓపెనింగ్‌ జోడీగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఈ ఘతన సాధించారు. 

టెస్ట్‌ క్రికెట్‌లోనే కాదు, యావత్‌ ఫస్ట్‌క్లాస్‌ చరిత్రలోనే ఒకే మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన తొలి ఓపెనింగ్‌ జోడీగా కాన్వే, లాథమ్‌ చరిత్ర సృష్టించారు.

ఈ మ్యాచ్‌లో లాథమ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 137, రెండో ఇన్నింగ్స్‌లో 101 పరుగులు చేయగా.. కాన్వే తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ (227), రెండో ఇన్నింగ్స్‌లో 100 పరుగులు చేశాడు. వ్యక్తిగతంగా కాన్వే మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒకే టెస్ట్‌ మ్యాచ్‌లో ద్విశతకం, శతకం సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచవాప్తంగా ఈ ఫీట్‌ను మరో తొమ్మిది మంది మాత్రమే సాధించారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. మౌంట్‌ మాంగనూయ్‌ వేదికగా న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగుతుంది. 462 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో విండీస్‌ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. బ్రాండన్‌ కింగ్‌ 37, జాన్‌ క్యాంప్‌బెల్‌ 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో విండీస్‌ గెలవాలంటే మరో 419 పరుగులు చేయాలి.

అంతకుముందు కివీస్ సెకెండ్ ఇన్నిం‍గ్స్‌ను 306/2 వ‌ద్ద డిక్లేర్ చేసింది. కాన్వే, లాథ‌మ్ శ‌త‌క్కొట్టారు. దీనికి ముందు విండీస్‌ కూడా తమ మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (63), జాన్ కాంప్‌బెల్ (45) మంచి ఆరంభం ఇవ్వగా..  కవేమ్ హాడ్జ్ (123) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 420 పరుగులకు ఆలౌట్ అయింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 575 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కాన్వే డబుల్‌ సెంచరీ, లాథమ్‌ సెంచరీ చేయగా.. రచిన్‌ రవీంద్ర (72 నాటౌట్‌) రాణించాడు. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)