Breaking News

అన్నీ తానై.. కష్టకాలంలో అర్థసెంచరీ

Published on Thu, 03/02/2023 - 16:15

టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా కష్టకాలంలో హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఇండోర్‌ వేదికగా మొదలైన మూడో టెస్టులో  పుజారా అర్థశతకంతో మెరిశాడు. ఒకవైపు సహచరులు వెనుదిరుగుతున్నా తాను మాత్రం ఒక ఎండ్‌లో నిలబడి టీమిండియా ఇన్నిం‍గ్స్‌ను నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్‌ 45.1 ఓవర్లో 108 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 50 పరుగులు సాధించాడు.

పుజారా టెస్టు కెరీర్‌లో ఇది 35వ హాఫ్‌ సెంచరీ కావడం గమనార్హం. పిచ్‌పై బంతి అనూహ్యంగా టర్న్‌ అవుతుండడంతో ఎలా బ్యాటింగ్‌ చేయాలో అర్థం కాక బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పుజారా మాత్రం తన విలువేంటో చూపిస్తూ టీమిండియాను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే 2021 ఏడాది నుంచి చూసుకుంటే టెస్టుల్లో పుజారా బ్యాటింగ్‌ సగటు తొలి ఇన్నింగ్స్‌ కంటే రెండో ఇన్నింగ్స్‌లోనే ఎక్కువగా ఉంది. 2021 నుంచి చూసుకుంటే తొలి ఇన్నింగ్స్‌లో పుజారా సగటు 19.04 ఉంటే(22 ఇన్నింగ్స్‌లు).. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 52.06(19 ఇన్నింగ్స్‌లు) సగటు ఉండడం విశేషం.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే టీమిండియా ఎదురీదుతోంది. టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. పుజారా 52 పరుగులతో ఆడుతూ ఒంటరిపోరాటం చేస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా 57 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలగా.. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌట్‌ అయింది.

చదవండి: స్టన్నింగ్‌ క్యాచ్‌.. అడ్డంగా దొరికిపోయిన శ్రేయాస్‌

తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉండి కూడా నిప్పులు చెరిగిన ఉమేశ్‌ 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)