భారత్‌తో టీ20 సిరీస్‌.. శ్రీలంక జట్టు ప్రకటన.. కొత్త కెప్టెన్‌ ఎంపిక

Published on Tue, 07/23/2024 - 11:59

త్వరలో భారత్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌ కోసం 16 మంది సభ్యుల శ్రీలంక జట్టును ఇవాళ (జులై 23) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా చరిత్‌ అసలంక ఎంపికయ్యాడు. టీ20 వరల్డ్‌కప్‌ 2024లో ఘోర ప్రదర్శన (తొలి రౌండ్‌లోనే నిష్క్రమణ) అనంతరం వనిందు హసరంగ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

సీనియర్లు ధనంజయ డిసిల్వ, ఏంజెలో మాథ్యూస్‌ ఈ సిరీస్‌కు ఎంపిక కాలేదు. మరో ఇద్దరు సీనియర్లు దినేశ్‌ చండీమల్‌, కుశాల్‌ జనిత్‌ పెరీరా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా ముగిసిన లంక ప్రీమియర్‌ లీగ్‌లో సత్తా చాటిన అవిష్క ఫెర్నాండో, చమిందు విక్రమసింఘే, బినుర ఫెర్నాండో కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. సదీర సమరవిక్రమ, దిల్షన్‌ మధుషంకలను పక్కకు పెట్టారు సెలెక్టర్లు.

కాగా, శ్రీలంకతో టీ20 సిరీస్‌ ఈనెల 27 నుంచి మొదలు కానుంది. ఈ సిరీస్‌ కోసం భారత జట్టు ఇప్పటికే లంక గడ్డపై అడుగుపెట్టింది. భారత టీ20 జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. భారత హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌కు ఇదే మొదటి పరీక్ష. జులై 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్‌ 2, 4, 7 తేదీల్లో వన్డే సిరీస్‌ జరుగనుంది. 

భారత్‌తో టీ20 సిరీస్‌కు శ్రీలంక జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్‌), పథుమ్ నిస్సంక, కుశాల్‌ జనిత్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, దినేశ్‌ చండిమల్, కమిందు మెండిస్, దసున్ షనక, వనిందు హసరంగ, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, మతీశ పతిరణ, నువాన్‌ తుషార, దుష్మంత చమీరా, బినుర ఫెర్నాండో

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)