Breaking News

టీమిండియా పాకిస్తాన్‌కు రావాల్సిందే: పీసీబీ చీఫ్‌

Published on Mon, 10/07/2024 - 16:07

చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్‌ టీమిండియాను తమ దేశానికి రప్పించాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం గురించి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) వద్ద తమ వాదనను వినిపించిన పాక్‌ బోర్డు.. భారత జట్టు కోసం వేదికను తరలించవద్దని విజ్ఞప్తి చేసింది.

వేదిక మార్చబోమన్న ఐసీసీ 
ఇందుకు తాము సానుకూలంగా ఉన్నట్లు ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జాఫ్రీ అలార్డిస్‌ ఇటీవల సంకేతాలు ఇచ్చాడు. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డే(పీసీబీ) ఈ మెగా టోర్నీని నిర్వహిస్తుందని.. వేదికను మార్చే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశాడు. అయితే, భారత క్రికెట్‌ నియంత్రణ మండలి మాత్రం ఇందుకు సుముఖంగా లేదని వార్తలు వినిపిస్తున్నాయి.

కేంద్రం అనుమతినిస్తేనే
ఆటగాళ్ల భద్రత దృష్ట్యా పాకిస్తాన్‌ పర్యటనకు పంపకూడదని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా మాట్లాడుతూ.. టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదా అనేది భారత ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉందని స్పష్టం చేశాడు. కేంద్రం అనుమతినిస్తేనే తమ జట్టు ఏ టూర్‌కైనా వెళ్లుందని.. పాకిస్తాన్‌ కూడా ఇందుకు మినహాయింపుకాదని పేర్కొన్నాడు.

జైశంకర్‌తో భేటీ కానున్న పీసీబీ చీఫ్‌?
ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్‌ మొహ్సిన్‌ నక్వీ కీలక ముందడుగు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌తో నక్వీ భేటీ కానున్నట్లు పాక్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌(SCO) సమావేశంలో పాల్గొనేందుకు జైశంకర్‌ పాకిస్తాన్‌కు వెళ్లనున్న విషయం తెలిసిందే.

ఇస్లామాబాద్‌లో అక్టోబరు 15-16 తేదీల్లో ఈ సమ్మిట్‌ నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నేపథ్యంలో నక్వీ జైశంకర్‌ను కలిసి.. టీమిండియా పాక్‌ పర్యటన గురించి మాట్లాడాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. అంతేకాదు.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్న ఈ ఐసీసీ టోర్నీ వీక్షించేందుకు ఆయనను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.

అన్ని జట్లు ఇక్కడకు రావాల్సిందే
ఇందుకు సంబంధించిన ప్రొటోకాల్స్‌, భద్రతా అంశాల గురించి మొహ్సిన్‌ నక్వీ.. జైశంకర్‌కు వివరించనున్నట్లు క్రికెట్‌ పాకిస్తాన్‌ నివేదిక పేర్కొంది.  ఈ నేపథ్యంలో నక్వీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టీమిండియా ఇక్కడకు వస్తుందనే అనుకుంటున్నాం. పర్యటనను రద్దు చేసుకోవడానికి గానీ.. వాయిదా వేయడానికి గానీ కారణాలు లేవు. అన్ని జట్లు ఇక్కడకు రావాల్సిందే’’ అని పేర్కొన్నాడు. 

కాగా 2008 ఆసియా కప్‌ తర్వాత ఇంత వరకు భారత జట్టు ఒక్కసారి కూడా పాకిస్తాన్‌కు వెళ్లలేదు. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా బీసీసీఐ కూడా పాక్‌తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లలోనూ పాల్గొనడం లేదు. అయితే, గతేడాది ఆసియా వన్డే కప్‌-2023 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్‌ దక్కించుకోగా.. టీమిండియా అక్కడకు వెళ్లలేదు. 

ఎవరి మాట నెగ్గుతుందో?
దీంతో రోహిత్‌ సేన ఆడిన మ్యాచ్‌లకు తటస్థ వేదికగా శ్రీలంకను ఉపయోగించుకున్నారు. ఇక చాంపియన్స్‌ ట్రోఫీ విషయంలోనూ ఇదే తరహా హైబ్రిడ్‌ విధానాన్ని  అనుసరించాలని బీసీసీఐ ఐసీసీని కోరినట్లు సమాచారం. 

కానీ పీసీబీ మాత్రం తమ దేశంలో ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ వంటి జట్టు పర్యటించాయని.. ఆటగాళ్ల భద్రత విషయంలో ఆందోళన అవసరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. 

మరి ఈ విషయంలో ఎవరి మాట నెగ్గుతుందో చూడాలి! కాగా చాంపియన్స్‌ ట్రోఫీకి ఆతిథ్య పాకిస్తాన్‌తో పాటు టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్‌, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ అర్హత సాధించాయి.

చదవండి: నేను అలా బౌలింగ్‌ చేయడానికి కారణం వారే: మయాంక్‌ యాదవ్‌

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)