Breaking News

CT: మాతో పాటు టీమిండియా.. సెమీస్‌ చేరే జట్లు ఇవే: అఫ్గన్‌ కెప్టెన్‌

Published on Wed, 09/25/2024 - 18:06

ICC Champions Trophy 2025: వచ్చే ఏడాది చాంపియన్స్‌ ట్రోఫీ రూపంలో మరో క్రేజీ ఈవెంట్‌ క్రికెట్‌ ప్రేమికులను అలరించనుంది. దాదాపు ఏడేళ్ల రీఎంట్రీ ఇవ్వనున్న ఈ ఐసీసీ టోర్నీ పాకిస్తాన్‌లో‌ జరుగనుంది. 2017లో ట్రోఫీ గెలిచిన పాక్‌.. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.

అఫ్గనిస్తాన్‌ చేతిలో తొలి ఓటమి
అయితే, గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌-2023లో బాబర్‌ ఆజం జట్టు చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న విషయం తెలిసిందే. భారత్‌ వేదికగా జరిగిన ఈ మెగా ఈవెంట్లో కనీసం సెమీస్‌ కూడా చేరకుండానే పాక్‌ నిష్క్రమించింది. అంతేకాదు.. తమ వన్డే చరిత్రలో మొట్టమొదటిసారి అఫ్గనిస్తాన్‌ చేతిలో ఓటమిని చవిచూసింది.

పొట్టి వరల్డ్‌కప్‌లో మరీ ఘోరంగా
ఈ నేపథ్యంలో దారుణ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ బాబర్‌ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అయితే, టీ20 ప్రపంచకప్‌-2024కు ముందు మళ్లీ పాకిస్తాన్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా వన్డే, టీ20 జట్ల పగ్గాలు చేపట్టాడు. కానీ పొట్టి వరల్డ్‌కప్‌లో మరీ ఘోరంగా.. పసికూన అమెరికా చేతిలో ఓడి.. సూపర్‌-8కు కూడా చేరకుండానే పాక్‌ ఇంటిబాట పట్టడం గమనార్హం.

సంచలన విజయాలతో అఫ్గన్‌ సెమీ ఫైనల్‌కు
మరోవైపు.. అఫ్గనిస్తాన్‌ సంచలన విజయాలతో ఏకంగా సెమీ ఫైనల్‌కు చేరడం విశేషం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దిగ్గజ జట్లకు షాకిచ్చి టాప్‌-4లో నిలిచింది. అయితే, సెమీస్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడి టోర్నీ నుంచి వైదొలిగినా.. ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ప్రశంసలు అందుకుంది.

చాంపియన్‌గా చాంపియన్‌గా
ఇక ఈ పొట్టి వరల్డ్‌కప్‌ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి.. టీమిండియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్‌ తర్వాత జరుగబోయే తొలి ఐసీసీ ఈవెంట్‌ కాబట్టి చాంపియన్స్‌ ట్రోఫీ పైనే అందరి దృష్టి నెలకొంది. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్‌ వన్డే జట్టు కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

సెమీస్‌ చేరే జట్లు ఇవే
చాంపియన్స్‌ట్రోఫీ-2025 సెమీ ఫైనల్‌ చేరే జట్లు ఇవేనంటూ అఫ్గనిస్తాన్‌తో పాటు.. వన్డే ప్రపంచకప్‌-2023 విజేత ఆస్ట్రేలియా, రన్నరప్‌ ఇండియా, మాజీ చాంపియన్‌ ఇంగ్లండ్‌ పేర్లను చెప్పాడు. గత కొన్నాళ్లుగా వరుస వైఫల్యాలతో చతికిల పడ్డ ఆతిథ్య పాకిస్తాన్‌ పేరును షాహిది పక్కనపెట్టడం గమనార్హం. కాగా అఫ్గన్‌ ఇటీవలే తొలిసారిగా సౌతాఫ్రికాపై వన్డే విజయం సాధించడంతో పాటు సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న జోష్‌లో ఉంది.

ఇదిలా ఉంటే.. వచ్చే ఫిబ్రవరిలో జరుగనున్న చాంపియన్స్‌ట్రోఫీ కోసం టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదా? అన్న అంశంపై ఇంత వరకు స్పష్టత రాలేదు. తమకు తటస్థ వేదికలు కేటాయించాలని బీసీసీఐ కోరగా.. ఐసీసీ నుంచి ఇంత వరకు ఎలాంటి హామీ రాలేదని సమాచారం.

చదవండి: Ind vs Ban: అతడికి రెస్ట్‌.. టీమిండియాలోకి ఇషాన్‌ ఎంట్రీ!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)