Breaking News

ఆమెకు బ్రేకప్‌ చెప్పిన టీమిండియా స్టార్‌!

Published on Thu, 01/22/2026 - 12:18

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ మరోసారి వార్తల్లోకెక్కాడు. అతడి ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న ఆర్జే మహ్‌వశ్‌తో చహల్‌కు విభేదాలు తలెత్తాయనేది ఆ వార్తల సారాంశం. కొరియోగ్రాఫర్‌, యూట్యూబర్‌ ధనశ్రీ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చహల్‌.

అయితే, వివాహమైన కొన్ని నెలలకే తమ మధ్య గొడవలు జరిగాయని.. విడాకులు తీసుకోవడమే ఉత్తమమని భావించినట్లు కోర్టును ఆశ్రయించింది ఈ జంట. గతేడాది అధికారికంగా వీరికి విడాకులు మంజూరయ్యాయి.

ఆర్జేతో చెట్టాపట్టాల్‌
కానీ అంతకంటే ముందు నుంచే చహల్‌.. ఆర్జే మహ్‌వశ్‌ (RJ Mahvash)తో కలిసి చక్కర్లు కొడుతున్న వీడియోలు వైరల్‌ అయ్యాయి. చాంపియన్స్‌ ట్రోఫీ-2025 సందర్భంగా ఆమెతో కలిసి మ్యాచ్‌ను వీక్షిస్తున్న ఫొటోలు షేర్‌ చేసి తమ మధ్య స్నేహ బంధం ఉందని చహల్‌ స్పష్టం చేశాడు.

కాపురాన్ని ఆమే కూల్చేసిందని.. 
ఈ ఘటన తర్వాత కొన్నాళ్లకే చహల్‌- ధనశ్రీలకు విడాకులు మంజూరు కావడంతో.. అప్పటిదాకా ధనశ్రీని తిట్టినవారంతా ఆర్జే మహ్‌వశ్‌పై దృష్టి సారించారు. చహల్‌ కాపురాన్ని ఆమే కూల్చేసిందని.. భార్యభర్తల మధ్య దూరి విడాకులకు కారణమైందని పెద్ద ఎత్తున ట్రోల్‌ చేశారు.

మరోవైపు.. చహల్‌కు మద్దతుగా పరోక్షంగా ధనశ్రీని టార్గెట్‌ చేస్తూ మహ్‌వశ్‌ సైతం పోస్టులు పెట్టింది. దీంతో నెటిజన్లు మరోసారి ‘‘హోం బ్రేకర్‌’’ అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇటీవల చహల్‌ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఓ అమ్మాయి, అబ్బాయి కలిసి కనిపిస్తే చాలు వదంతులు వ్యాప్తి చేస్తారు.

ఏడుస్తూ కూర్చోలేము కదా!
అంతమాత్రాన మేము ఏడుస్తూ కూర్చోలేము కదా!.. జనాలు ఏమనుకుంటున్నారో అదే అనుకోనివ్వండి. మాకేం తేడా ఉండదు. మా కాపురాన్ని కూల్చిందని ఆమెను ఆడిపోసుకున్నారు. ఇంకా ఎన్నెన్నో మాటలు అన్నారు. ఓ మహిళను ఎన్ని రకాలుగా కించపరచవచ్చో అన్ని రకాలుగా మాట్లాడారు.

యుజీ ఆమెతో ఎందుకు ఉన్నాడని చాలా మంది అన్నారు. కష్టకాలంలో నాకు సహాయంగా నిలబడ్డ నా స్నేహితురాలిని అలా నిందించడం నాకు బాధ కలిగించింది. ఫ్రెండ్స్‌ అందరితో కలిసి వెళ్లినా మా ఫొటోలు మాత్రమే క్రాప్‌ చేసి రూమర్స్‌ వ్యాప్తి చేశారు. అందుకే కలిసి బయటకు వెళ్లడం కూడా మానేశాము’’ అని చెప్పు​కొచ్చాడు.

ఒకరినొకరు అన్‌ఫాలో
మరోవైపు.. ఆర్జే మహ్‌వశ్‌ సైతం అబ్బాయితో కలిసి బయటకు వెళ్తే చాలు డేటింగ్‌ అంటున్నారని.. అసలు మనం ఏ కాలంలో ఉన్నామంటూ మండిపడింది. పరోక్షంగా చహల్‌తో తనకు స్నేహం మాత్రమే ఉందని స్పష్టం చేసింది. అయితే, తాజాగా వీరిద్దరు సోషల్‌ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం గమనార్హం.

నేను ఎవరినీ నమ్మను
దీంతో చహల్‌- మహ్‌వశ్‌ మధ్య విభేదాలు తలెత్తి విడిపోయారంటూ నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు చహల్‌ ఇన్‌స్టా స్టోరీలో.. ‘‘నేను ఎవరినీ నమ్మను’’ అని పోస్ట్‌ పెట్టడం ఇందుకు బలమిచ్చింది. 

మరో స్టోరీలో ‘‘బాధ, ఆశల వలయంలో చిక్కుకుపోకుండా.. బంధాల్లో మునిగిపోకుండా.. కోపం, భయాన్ని వదిలేసి ముందుకు సాగేవాడే తెలివైన మనిషి’’ అన్న భవద్గీత పంక్తులను కూడా చహల్‌ షేర్‌ చేయడం విశేషం.

చదవండి: చక్కటి సంసారం.. ‘వివాహేతర సంబంధం’ చిచ్చు.. ఆఖరికి!

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)