Breaking News

'సామాన్యుడు కాడు వీడు'.. టెన్నిస్‌ చరిత్రలో అత్యుత్తమ షాట్‌

Published on Fri, 06/09/2023 - 20:40

ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా వరల్డ్‌ నెంబర్‌ వన్‌ కార్లెస్‌ అల్కరాజ్‌, సెర్బియా స్టాన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ మధ్య సెమీఫైనల్‌ పోరు ఆసక్తికరంగా సాగుతుంది. ఇద్దరు నువ్వా నేనా అన్నట్లుగా కొదమ సింహాల్లా తలపడుతున్నారు. ఇప్పటికైతే తొలి సెట్‌ను జొకోవిచ్‌ 6-3తో సొంతం చేసుకున్నప్పటికి.. రెండో సెట్‌లో మాత్రం అల్కరాజ్‌ లీడింగ్‌లో ఉన్నాడు. హోరాహోరీగా సాగుతున్న మ్యాచ్‌లో గెలుపు ఎవరిది అని చెప్పడం కష్టంగా మారింది.

ఈ విషయం పక్కనబెడితే..  మ్యాచ్‌ సందర్భంగా అల్కరాజ్‌ చేసిన విన్యాసం జొకోవిచ్‌ చేత చప్పట్లు కొట్టించింది. వరల్డ్‌ నెంబర్‌ వన్‌ అనే పదానికి సార్థకం చేస్తూ అల్కరాజ్‌ కొట్టిన బ్యాక్‌ హ్యాండ్‌ షాట్‌ చరిత్రలో మిగిలిపోనుంది. విషయంలోకి వెళితే.. రెండోసెట్‌లో భాగంగా ఇద్దరు 1-1తో ఉన్నప్పుడు జొకోవిచ్‌ కాస్త తెలివిగా ర్యాలీ చేశాడు. అయితే అల్కరాజ్‌ వేగంగా స్పందించి షాట్‌ ఆడాడు. కానీ అల్కరాజ్‌ కోర్టు దగ్గరకు రావడం.. అదే సమయంలో జొకోవిచ్‌ ఆఫ్‌సైడ్‌ రిఫ్ట్‌ షాట్‌ కొట్టాడు.

ఇక జొకోకు పాయింట్‌ వచ్చినట్లేనని అంతా భావించారు. కానీ ఇక్కడే అల్కరాజ్‌ ఎవరు ఊహించని ఫీట్‌ నమోదు చేశాడు. వేగంగా పరిగెత్తిన అల్కరాజ్‌ బ్యాక్‌హ్యాండ్‌ స్ట్రోక్‌ ఉపయోగించి షాట్‌ కొట్టాడు. బంతి కూడా లైన్‌ ఇవతల పడడంతో అల్కరాజ్‌ పాయింట్‌ గెలుచుకున్నాడు. అల్కరాజ్‌ చర్యకు ఆశ్చర్యపోయిన జొకోవిచ్‌ చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: 'చాన్స్‌ కూడా ఇవ్వలేదు'.. సిరాజ్‌ దెబ్బకు లేచి కూర్చొన్నాడు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)