Breaking News

'టాస్ వేయడం ఒక్కటే అతడి పనికాదు'

Published on Sat, 12/13/2025 - 13:46

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్‌తో నానా తంటాలు పడుతున్నాడు. దాదాపు రెండేళ్లగా వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా కొనసాగిన సూర్య.. 2025లో మాత్రం ఘోరంగా విఫలయ్యాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఈ ముంబై ఆటగాడు తీవ్ర నిరాశపరుస్తున్నాడు.

తొలి టీ20లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసిన సూర్య.. రెండో టీ20లో ఐదు పరుగులే చూసి పెవిలియన్‌కు చేరాడు. టీ20 ప్రపంచకప్‌-2026కు ముందు అతడి పూర్ ఫామ్ టీమ్‌మెనెజ్‌మెంట్‌ను తెగ కలవరపడుతోంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌పై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా విమర్శలు గుప్పించాడు. 

కెప్టెన్ అంటే టాస్‌లు వేయడం, ఫీల్డ్‌ను సెట్ చేయడం కాదని పరుగులు కూడా చోప్రా అన్నాడు. ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కు 18 అంత‌ర్జాతీయ టీ20లు ఆడిన స్కై.. 15.07 స‌గ‌టుతో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు.

"సూర్య.. భారత జట్టుకు కెప్టెన్ అన్న విషయం మర్చిపోకూడదు. కెప్టెన్ పని కేవలం టాస్ వేయడం, బౌలర్లను రోటేట్ చేయడం, వ్యూహాలు రచించడమే కాదు. బ్యాట్‌తో కూడా రాణించాలి. టాప్ ఫోర్‌లో బ్యాటింగ్‌కు వస్తుందున ఖచ్చింగా పరుగులు చేయాలి. ఈ ఏడాది అతడు చాలా మ్యాచ్‌లు ఆడాడు.

అయినా అతడి ఆట తీరు మారలేదు. ఇప్పటివరకు ఈ ఏడాదిలో 18 మ్యాచ్‌లు ఆడి కేవలం 15 సగటు మాత్రమే కలిగి ఉన్నాడు.  స్ట్రైక్ రేట్ కూడా మరీ ఘోరంగా ఉంది. ఒక్క అర్థ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. ఐపీఎల్‌కు ముందు, తర్వాత కూడా అతడి ఫామ్‌లో ఎటువంటి మార్పు కన్పించలేదు. 

మూడు లేదా నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి పరుగులు సాధించకపోతే జట్టుకు ఎల్లప్పుడూ అదే భారంగానే ఉంటుంది. ఇదే ఫామ్‌తో టీ20 ప్రపంచకప్‌లో ఎలా రాణిస్తారు. కాబట్టి కెప్టెన్‌తో పాటు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా తన ఫామ్‌ను అందుకోవాల్సిన అవసరముందని చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: IND vs SA: గంభీర్ సంచ‌ల‌న నిర్ణ‌యం..? గిల్‌కు ఊహించని షాక్‌!

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)