పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!
Breaking News
కెనడా ప్లేయర్‌కు విరిగిన కాలు; కట్‌చేస్తే ఖతార్‌కు చుక్కలు!
Published on Fri, 06/19/2026 - 07:06
ఫిఫా ప్రపంచకప్‌లో ఆతిథ్య కెనడా బోణీ కొట్టింది. గ్రూప్-బిలో ఉన్న కెనడా 6-0తో ఖతార్‌పై భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్ డ్రా చేసుకున్న కెనడాకు ఇదే తొలి విజయం. కెనడా తరఫున జొనాథన్ డేవిడ్ హ్యాట్రిక్ గోల్స్‌తో (ఆట 29వ, 45+3వ, 90+2వ నిమిషంలో) మెరవగా, సైల్ లారిన్ (ఆట 16వ నిమిషం), నాథన్ సలిబా (ఆట 64వ నిమిషం), ఖతార్ ఆటగాడు మొహమ్మద్ మనాయి (ఆట 75వ నిమిషంలో) సెల్ఫ్ గోల్ చేయడంతో అది కెనడా ఖాతాలోకి వెళ్లిపోయింది.
అయితే ఖతార్ తరఫున హొమమ్ అహ్మద్ (ఆట 33వ నిమిషం), అస్సిమ్ మదిబొ (ఆట 53వ నిమిషం) గోల్స్ కొట్టినప్పటికీ తప్పిదాలతో రిఫరీ రెడ్ కార్డ్ చూపడంతో ఖతార్ గోల్స్ చెల్లలేదు. దీంతో కెనడా భారీ విజయంతో 4 పాయింట్లతో పట్టికలో తొలి స్థానంలో ఉంది.

ఇదే మ్యాచ్‌లో కెనడా స్టార్ మిడ్‌ఫీల్డర్ ఇస్మాయిల్ కొనే ప్రత్యర్థి ఆటగాడి ఫౌల్ కారణంగా తన ఎడమ కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. నొప్పి భరించలేక మైదానంలోనే స్ట్రెచర్‌పై ఆక్సిజన్ మాస్క్‌తో బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఇక మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన జొనాథన్ డేవిడ్ అరుదైన ఫీట్ సాధించాడు. 2026 ఫిఫా ప్రపంచకప్‌లో మెస్సీ తర్వాత హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. మూడు కీలక గోల్స్‌తో కెనడా విజయంలో కీలకపాత్ర పోషించిన జొనాథన్‌నే ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.
చదవండి: వివాదంలో మెస్సీ.. భగ్గుమన్న అభిమానులు!
Tags : 1