Breaking News

ప్రపంచంలో ఎక్కడా జరగనిది.. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో ఇదే తొలిసారి!

Published on Thu, 09/04/2025 - 18:55

148 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌లో కెనడా జట్టు అత్యంత చెత్త రికార్డును మూట కట్టకుంది.  ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో ఇన్నింగ్స్‌ తొలి రెండు బంతులకే ఓపెనర్లు వికెట్లు కోల్పోయిన మొదటి జట్టుగా కెనడా నిలిచింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్‌-2లో భాగంగా ఇటీవలే కెనడా, స్కాట్లాండ్ జట్లు తలపడ్డాయి.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన స్కాట్లాండ్ తొలుత కెనడాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కెనడాకు ఆదిలోనే ఊహించని షాక్ తగిలింది. తొలి బంతికే కెనడా ఓపెనర్ అలీ నదీమ్‌ను స్కాటిష్ పేసర్ బ్రాడ్ క్యూరీ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి పర్గత్ సింగ్ వచ్చాడు.

అయితే ఇక్కడే అనుహ్య సంఘ‌ట‌న చోటు చేసుకుంది. రెండో బంతిని  పర్గత్ సింగ్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. కానీ దుర‌దృష్టవశాత్తూ బంతి బౌలర్ చేతి వేలు తాకుతూ నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో బెయిల్స్‌ను గిరాటేసింది. దీంతో నాన్‌స్ట్రైక్‌లో ఉన్న మరో ఓపెనర్ యువరాజ్ సమ్రా రనౌట‌య్యాడు. యువ‌రాజ్ కనీసం ఒక్క బంతి కూడా ఆడ‌కుండా డైమండ్ డ‌క్‌గా పెవిలియ‌న్ చేరాల్సింది. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో తొలి ఓవ‌ర్‌లోనే ఇలా వ‌రుస బంతుల్లో ఓపెన‌ర్లు ఔట్ కావ‌డం ఇదే మొద‌టి సారి. 

స్కాట్లాండ్‌ ఘన విజయం..
ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కెన‌డా 48.1 ఓవ‌ర్ల‌లో 184 ప‌రుగులకు ఆలౌటైంది. కెన‌డా బ్యాట‌ర్ల‌లో కెప్టెన్‌ శ్రేయాస్ మొవ్వ(60) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. జస్కరన్ సింగ్(32) ప‌రుగుల‌తో రాణించారు. స్కాట్లాండ్ బౌల‌ర్ క్యూరీ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టి కెన‌డా ప‌త‌నాన్ని శాసించాడు. 

అత‌డితో పాటు బ్రాండన్ మెక్‌ముల్లెన్ రెండు.. వాట్, ష‌రీఫ్ త‌లా వికెట్లు సాధించారు. అనంత‌రం 185 ప‌రుగుల ల‌క్ష్యాన్ని స్కాట్లాండ్ కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 41.5 ఓవ‌ర్ల‌లో చేధించింది. ఓపెన‌ర్ మున్సీ(84 నాటౌట్‌) టాప్ స్కోర‌ర్‌గా నిలిచి మ్యాచ్‌ను ముగించాడు.
చదవండి: సెంచ‌రీతో చెల‌రేగిన స్టార్ ప్లేయ‌ర్‌.. టీమిండియా అరంగేట్రం ఖాయం!?
 

Videos

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు