Ashes: ఉస్మాన్‌ ఖవాజాపై క్రికెట్‌ ఆస్ట్రేలియా ఫైర్‌

Published on Sat, 11/29/2025 - 16:09

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ ఉస్మాన్‌ ఖవాజా చిక్కుల్లో పడ్డాడు. అభ్యంతకర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచి సొంత బోర్డు ఆగ్రహానికి గురయ్యాడు. అసలేం జరిగిందంటే.. ఆస్ట్రేలియా- ఇంగ్లండ్‌ మధ్య ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ మొదలైన విషయం తెలిసిందే.

ఈ టెస్టు సిరీస్‌లో భాగంగా పెర్త్‌ వేదిక (Perth Stadium)గా తొలి మ్యాచ్‌లో పర్యాటక ఇంగ్లండ్‌ను ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. అయితే, తొలిరోజు పెర్త్‌ పిచ్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించింది. ఎక్స్‌ట్రా బౌన్స్‌తో పేసర్లు బ్యాటర్లను తిప్పలు పెట్టారు.

తొలిరోజే పందొమ్మిది వికెట్లు
ఈ క్రమంలో ఆట మొదలైన రోజే ఏకంగా పందొమ్మిది వికెట్లు కూలాయి. ఆసీస్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ (Mitchell Starc) ఏడు వికెట్లతో చెలరేగగా.. ఇంగ్లండ్‌ సారథి బెన్‌ స్టోక్స్ (Ben Stokes) ఐదు వికెట్లతో సత్తా చాటాడు. మిగిలిన వారిలో ఆసీస్‌ నుంచి బ్రెండన్‌ డాగెట్‌ రెండు, కామెరాన్‌ గ్రీన్‌ ఒక వికెట్‌ తీయగా.. ఇంగ్లండ్‌ తరఫున జోఫ్రా ఆర్చర్‌ రెండు, బ్రైడన్‌ కార్స్‌ మూడు వికెట్లు కూల్చారు.

అదొక గొప్ప వికెట్‌ అంటూ వెటకారం
ఈ నేపథ్యంలో పెర్త్‌ వికెట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆసీస్‌ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా సైతం పెర్త్‌ పిచ్‌పై స్పందిస్తూ.. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. SEN క్రికెట్‌తో మాట్లాడుతూ.. ‘‘తొలిరోజే 19 వికెట్లు పడ్డాయి. ఇరవై మందికి దెబ్బలు కూడా తగిలాయి. అదొక గొప్ప వికెట్‌. నిజంగానే ఎవరైనా ఈ మాట అంటారా?

నా కెరీర్‌లో స్టీవ్‌ స్మిత్‌ వంటి గొప్ప బ్యాటర్‌ను ఇంత వరకు చూడలేదు. అయితే, అతడు కూడా పరుగులు రాబట్టేందుకు ఇబ్బందిపడ్డాడు. తను అసలు బ్యాలెన్స్‌ చేసుకోలేకపోయాడు. అతడి మోచేతికి బంతి తగిలింది. బ్యాట్‌ను ఆడించడమే గగనం అయిపోయింది.

నా దృష్టిలో S**T వంటిది
అందుకే పెర్త్‌లో తొలి రోజు ఆట నా దృష్టిలో S**T వంటిది. ఇది చెప్పడానికి నేనేమీ భయపడను. గతేడాది.. ఇప్పుడ ఈ పిచ్‌ ఒకేలా ఉంది’’ అంటూ ఉస్మాన్‌ ఖవాజా ఘాటు విమర్శలు చేశాడు. ఓవైపు ఐసీసీ నుంచి పెర్త్‌ పిచ్‌కు.. ‘చాలా బాగుంది (Very Good)’ అనే ప్రశంస రాగా.. ఖవాజా మాత్రం ఇలా మాట్లాడటం గమనార్హం.

అంత మాట అంటావా?.. సీఏ ఫైర్‌
ఈ నేపథ్యంలోనే ఖవాజా వ్యాఖ్యలపై క్రికెట్‌ ఆస్ట్రేలియా (CA) ఫైర్‌ అయినట్లు తెలుస్తోంది. పెర్త్‌ పిచ్‌ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందుకుగానూ వివరణ ఇవ్వాల్సిందిగా అతడికి నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. 

ఖవాజా వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న బోర్డు కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఆసీస్‌- ఇంగ్లండ్‌ మధ్య బ్రిస్బేన్‌ వేదికగా డిసెంబరు 4-8 మధ్య రెండో టెస్టు (పింక్‌బాల్‌)కు ముహూర్తం ఖరారైంది. 

చదవండి:  అభిషేక్‌ శర్మ అట్టర్‌ఫ్లాప్‌.. సంజూ శాంసన్‌ ఫెయిల్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)