Breaking News

ప్రపంచ రికార్డు సమం చేసిన బుమ్రా

Published on Mon, 08/21/2023 - 21:09

ఐర్లాండ్‌తో రెండో టీ20లో టీమిండియా కెప్టెన్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఓ ప్రపంచ రికార్డు సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ను (ఛేదనలో) మెయిడిన్‌ చేసిన బుమ్రా.. అంతర్జాతీయ టీ20ల్లో (ఐసీసీ ఫుల్‌టైమ్‌ సభ్యదేశాలు పాల్గొన్న మ్యాచ్‌లు) అత్యధిక మెయిడిన్‌ ఓవర్లు (10) వేసిన బౌలర్‌గా సహచరుడు భువనేశ్వర్‌ కుమార్‌ రికార్డును సమం చేశాడు. భువీ 87 టీ20ల్లో 10 మెయిడిన్లు వేస్తే, బుమ్రా తన 62వ మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించాడు. ఈ విభాగంలో భువీ, బుమ్రాల తర్వాత బంగ్లాదేశ్‌ ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ (6), శ్రీలంక నువాన్‌ కులశేఖర (6) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. 

ఐర్లాండ్‌తో రెండో టీ20లో 4 ఓవర్లలో ఓ మెయిడిన్‌ వేసి 15 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టిన బుమ్రా మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక​ వికెట్లు (74) తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో చహల్‌ 96 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 90 వికెట్లతో భువనేశ్వర్‌ రెండో స్థానంలో ఉన్నాడు.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. ఐర్లాండ్‌తో నిన్న (ఆగస్ట్‌ 20) జరిగిన రెండో టీ20లో టీమిండియా 33 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. తద్వారా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం​ చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. రుతురాజ్‌ (58), శాంసన్‌ (40), రింకూ సింగ్‌ (38), శివమ్‌ దూబే (22 నాటౌట్‌) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఐర్లాండ్‌ లక్ష్యానికి 34 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ ఆండ్రూ బల్బిర్నీ (72) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ, రవి బిష్ణోయ్‌ తలో 2 వికెట్లు, అర్షదీప్‌ సింగ్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)