Breaking News

చాలా సంతోషంగా ఉంది.. నేను ఎప్పుడూ అలా ఫీలవ్వలేదు: బుమ్రా

Published on Fri, 08/18/2023 - 08:04

టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా 11 నెలల తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. డబ్లిన్‌ వేదికగా శుక్రవారం ఐర్లాండ్‌తో జరగనున్న తొలి టీ20లో భారత కెప్టెన్‌ హోదాలో బుమ్రా బరిలోకి దిగనున్నాడు. ఈ సిరీస్‌కు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా వంటి సీనియర్‌ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడంతో.. యువ భారత జట్టును బుమ్రా ముందుండి నడిపించనున్నాడు.

వెన్ను గాయం, శస్త్ర చికిత్స, పునరావస శిబిరం ఇలా చాన్నాళ్ల తర్వాత ఆడుతున్న టీమిండియా పేస్‌ గుర్రం బుమ్రా ఎలా రాణిస్తాడని అందరూ వెయ్యి కళ్లుతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి టీ20కు విలేకరుల సమావేశంలో పాల్గొన్న జస్ప్రీత్‌ బుమ్రా తన ఫిట్‌నెస్‌పై కీలక వాఖ్యలు చేశాడు. గాయం నుంచి కోలుకున్నాక తొలి మ్యాచ్‌ ఆడేందుకు అతృతగా ఎదురుచూస్తున్నాని బుమ్రా తెలిపాడు.

నా టార్గెట్‌ వరల్డ్‌కప్‌..
మళ్లీ భారత జట్టులోకి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం నేను 100 శాతం ఫిట్‌నెస్‌తో ఉన్నాను. నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో చాలా కష్టపడ్డాను. ఏన్సీఏలో సుదీర్ఘ కాలం పాటు గడిపాను. ప్రస్తుతం అంతమంచిగానే ఉంది. మైదానంలో అడుగుపెట్టేందుకు అతృతగా ఎదురుచూస్తున్నాను. నెట్స్‌లో బౌలింగ్‌ చేసేటప్పుడు నా శరీరం మీద పెద్దగా ఒత్తడి లేకుండా చూసుకున్నాను. అంతమాత్రాన నేను  వెనక్కు తగ్గినట్లు కాదు.

ఏన్సీఏ నుంచి బయటకు వచ్చాక  గుజరాత్ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేశాను. అనంతరం చాలా చోట్ల నెట్‌ప్రాక్టీస్‌ సెషన్స్‌లో కూడా పాల్గొన్నాను. నేను ఇప్పటికే చాలా ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు కూడా ఆడాను. నా రిహాబిటేషన్ ఎప్పుడూ కూడా టీ20లు ఆడేందుకు ప్రాక్టీస్‌ చేయలేదు. నా లక్ష్యం ప్రపంచకప్‌లో రాణించడమే. ప్రస్తుతం వరల్డ్‌కప్‌కు సిద్దమవుతున్నాను. నెట్‌ ప్రాక్టీస్‌లో 10 నుంచి 15 ఓవర్ల వరకు బౌలింగ్‌ చేస్తున్నాను.

అలా ఎక్కువ బౌలర్లు చేయడం నాకు చాలా ఉపయోగపడుతోంది. కొన్ని సార్లు గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి మనకు కొంచెం ఎక్కవ సమయం పడుతోంది. అటువంటి సమయంలో మనం కాస్త నిరాశ చెందుతాం. కానీ నేను ఎప్పుడూ అలా ఫీల్‌ అవ్వలేదు. త్వరగా కోలుకుని ఫీల్డ్‌లోకి రావడం గురించి మాత్రమే ఆలోచించాను అని బుమ్రా ప్రీ మ్యాచ్‌ కాన్ఫరెన్స్ లో పేర్కొన్నాడు.
చదవండి: NZ vs UAE: 5 వికెట్లతో చెలరేగిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌.. యూఏఈపై ఘన విజయం

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)