Breaking News

బుచ్చిబాబు టోర్నీ ఫైనల్‌: పటిష్ట స్థితిలో హైదరాబాద్‌

Published on Wed, 09/11/2024 - 10:19

చెన్నై: ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌ జట్టుతో జరుగుతున్న ఫైనల్లో హైదరాబాద్‌ ప్రత్యర్థి జట్టుకు 518 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. మ్యాచ్‌ మూడో రోజు హైదరాబాద్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 70.2 ఓవర్లలో 281 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ రాహుల్‌ సింగ్‌ (68; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్‌ రాధేశ్‌ (41; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.

రోహిత్‌ రాయుడు భారీ సెంచరీ
ఛత్తీస్‌గఢ్‌ బౌలర్‌ జీవేశ్‌ ఆరు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఛత్తీస్‌గఢ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 70.2 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటవ్వడంతో హైదరాబాద్‌కు 236 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. హైదరాబాద్‌ బౌలర్లలో అనికేత్‌ రెడ్డి నాలుగు వికెట్లు తీయగా... రోహిత్‌ రాయుడు, తనయ్‌ త్యాగరాజన్‌లకు మూడు వికెట్ల చొప్పున లభించాయి. 

హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 118.4 ఓవర్లలో 417 పరుగులు చేసింది. రోహిత్‌ రాయుడు (155; 8 ఫోర్లు, 8 సిక్స్‌లు) భారీ సెంచరీ సాధించాడు. అభిరత్‌ (85; 10 ఫోర్లు, 1 సిక్స్‌), రాహుల్‌ రాధేశ్‌ (48; 7 ఫోర్లు) ఆకట్టుకున్నారు.

టీమిండియా స్టార్లు సైతం
కాగా తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లలో టీమిండియా స్టార్లు శ్రేయస్‌ అయ్యర్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం శ్రేయస్‌, సర్ఫరాజ్‌ దులిప్‌ ట్రోఫీ-2024తో బిజీగా ఉండగా.. సూర్య, ఇషాన్‌ గాయాల బారిన పడ్డారు. 

చదవండి: DT 2024: భారత ‘ఎ’ జట్టులోషేక్‌ రషీద్‌.. టీమిండియాతో చేరని సర్ఫరాజ్‌ ఖాన్‌!

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)