Breaking News

వాళ్లిద్దరికే ఆ రికార్డు బ్రేక్‌ చేసే సత్తా ఉంది: లారా

Published on Thu, 07/11/2024 - 15:58

క్రికెట్‌ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియన్‌ లారా. అద్భుత బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. తన కెరీర్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లోనూ చిరస్థాయిగా నిలిచిపోయే ఓ ఘనత మాత్రం అన్నింటికంటే ప్రత్యేకం.

టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో ఇంత వరకు 400(నాటౌట్‌) పరుగులు సాధించిన ఒకే ఒక్క బ్యాటర్‌ లారా. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా 2004లో లారా ఈ ఫీట్‌ నమోదు చేశాడు. 

అదే విధంగా.. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఏకంగా 501(నాటౌట్‌) రన్స్‌ స్కోరు చేసిన ఘనత కూడా లారాకే దక్కింది. ఈ రెండు రికార్డులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి.

దూకుడైన ఆటగాళ్లు తక్కువే
ఈ నేపథ్యంలో బ్రియన్‌ లారాకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 400 పరుగుల మార్కు అందుకోగల బ్యాటర్‌ ఎవరన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఇద్దరు టీమిండియా యువ ఆటగాళ్ల పేర్లు చెప్పాడు లారా.

‘‘నేను క్రికెట్‌ ఆడే సమయంలో కనీసం మూడు వందల పరుగుల మార్కు దాటేందుకు వీరేంద్ర సెహ్వాగ్‌, క్రిస్‌ గేల్‌, ఇంజమామ్‌ ఉల్‌ హక్‌, సనత్‌ జయసూర్య వంటి వాళ్లు ఎంతగానో ప్రయత్నించారు.

ఇక ఇప్పుడు అలాంటి దూకుడైన ఆటగాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు. ఇంగ్లండ్‌ జట్టులో జాక్‌ క్రాలే, హ్యారీ బ్రూక్‌ అగ్రెసివ్‌గా ఆడుతున్నారు.

వీరిద్దరికే ఆ సత్తా ఉంది
ఇక భారత జట్టులో..?!.. యశస్వి జైస్వాల్‌, శుబ్‌మన్‌ గిల్‌ల పేర్లను చెప్పవచ్చు. వీరిద్దరు ఒక్కసారి క్రీజులో కుదురుకుని పరిస్థితులు గనుక అనుకూలిస్తే ఇలాంటి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టగలరు’’ అని బ్రియన్‌ లారా డైలీ మెయిల్‌తో వ్యాఖ్యానించాడు.

కాగా టీమిండియా భవిష్య కెప్టెన్‌గా పేరొందిన ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌కు టెస్టుల్లో ఇప్పటి వరకు అత్యధిక స్కోరు 128. ఇక మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఖాతాలో మాత్రం ఇప్పటికే రెండు డబుల్‌ సెంచరీలు ఉన్నాయి. 

అరంగేట్రంలోనే ఈ లెఫ్టాండర్‌ 171 పరుగులు చేశాడు. అంతేకాదు ఇప్పటిదాకా మూడుసార్లు 150 ప్లస్‌ స్కోర్లు సాధించాడు. 

చదవండి: WCL 2024: యువరాజ్‌ మళ్లీ ఫెయిల్‌.. యూసఫ్‌, ఇర్ఫాన్‌ మెరుపులు!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)