Breaking News

ఆసీస్‌ను చిత్తు చేసిన ఆనందంలో ఉన్న జింబాబ్వేకు భారీ షాక్‌

Published on Fri, 02/13/2026 - 19:37

2026 టీ20 ప్రపంచకప్‌-2026లో ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించి జోష్‌లో ఉన్న జింబాబ్వేకు భారీ షాక్‌ తగిలింది. అనుభవజ్ఞుడైన వికెట్‌కీపర్-బ్యాటర్‌ బ్రెండన్ టేలర్ హామ్‌స్ట్రింగ్ గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ టోర్నీలో జింబాబ్వే ఆడిన తొలి మ్యాచ్‌లో (ఒమన్‌) టేలర్‌ గాయపడ్డాడు. ఆ మ్యాచ్‌లో అతను మూడు అద్భుతమైన క్యాచ్‌లు పట్టడంతో పాటు 30 బంతుల్లో 31 పరుగులు చేశాడు. 

బ్యాటింగ్‌ సమయంలో టేలర్‌ కుడి కాలి హామ్‌స్ట్రింగ్‌తో ఇబ్బంది పడి రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. తొలుత గాయం చిన్నదే అనుకున్నా, వైద్య పరీక్షల తర్వాత ఆయన పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని తేలింది. దీంతో టేలర్‌ మెగా టోర్నీలో కొనసాగలేడని జింబాబ్వే క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. టేలర్‌ స్థానాన్ని బెన్‌ కర్రన్‌తో భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది.  

చరిత్రాత్మక ఆటగాడు
టేలర్‌కు ప్రపంచ క్రికెట్‌లో ఎవరికీ లేని ఓ ప్రత్యేకత ఉంది. అతను 0మొదటి టీ20 ప్రపంచకప్ (2007), ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌ ఆడిన ఏకైక ఆటగాడు. 40 ఏళ్ల వయసులోనూ టేలర్‌ జింబాబ్వే జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఆయన లేని లోటు జింబాబ్వేకు ఎదురుదెబ్బ అవుతుంది.

కాగా, ఇవాళ (ఫిబ్రవరి 13) జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై జింబాబ్వే 23 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కష్టమైన పిచ్‌పై బ్రియాన్‌ బెన్నెట్‌ (64 నాటౌట్‌), మరుమణి (35), ర్యాన్‌ బర్ల్‌ (35), సికందర్‌ రజా (25 నాటౌట్‌) నిలకడగా ఆడి గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో జింబాబ్వే బౌలర్లు చెలరేగిపోయారు. ముజరబానీ (4-0-17-4), బ్రాడ్‌ ఈవాన్స్‌ (3.3-0-23-3), మసకద్జ (4-0-36-1), ర్యాన్‌ బర్ల్‌ (1-0-9-1), గ్రేమీ క్రీమర్‌ (4-0-33-0) సత్తా చాటారు. ఫలితంగా ఆసీస్‌ 19.3 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ను గట్టెక్కించేందుకు మ్యాట్‌ రెన్‌షా (65), మ్యాక్స్‌వెల్‌ (31) విఫలయత్నం చేశారు.
 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు