Breaking News

బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన వెస్టిం‍డీస్‌

Published on Sat, 10/31/2026 - 16:13

ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 272 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో షాద్మాన్ ఇస్లాం(105), తౌహిద్ హ్రిదోయ్(42) మినహా మిగితా అందరూ దారుణంగా విఫలమయ్యారు. 

విండీస్ బౌలర్లలో జోమెల్ వారికన్ 5 వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ను దెబ్బతీశాడు. అనంతరం విండీస్ కూడా తమ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించలేకపోయింది. క‌రేబియ‌న్ జ‌ట్టు 245 ప‌రుగుల‌కే ఆలౌటైంది.  తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ (56 పరుగులు), జాన్ క్యాంప్‌బెల్ (54 పరుగులు) అర్ధసెంచరీలతో రాణించారు. 

బంగ్లా బౌల‌ర్ల‌లో స్పిన్న‌ర్ నయీమ్ హసన్ 4 వికెట్లు తీశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాకు 27 ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యం ల‌భించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కూడా బంగ్లా బ్యాట‌ర్ల ఆటతీరు ఏ మాత్రం మార‌లేదు. బంగ్లాదేశ్‌ జ‌ట్టు కేవ‌లం 142 ప‌రుగుల‌కే ఆలౌటైంది.

విండీస్ స్పిన్న‌ర్లు చేజ్ 5 వికెట్లు,  జోమెల్ వారికన్ 4 వికెట్లు ప‌డగొట్టి బంగ్లా ప‌త‌నాన్ని శాసించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ల‌భించిన ఆధిక్యాన్ని జోడించి విండీస్ ముందు 170 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని బంగ్లాదేశ్‌ ఉంచింది. ఈ ల‌క్ష్యాన్ని విండీస్ కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి చేధించింది. బ్రాండెన్ కింగ్‌(81) అజేయంగా నిలిచి మ్యాచ్ ముగించాడు. ఇరు జ‌ట్ల మ‌ద్య రెండో టెస్టు న‌వంబ‌ర్ 5 నుంచి సిల్హెట్ వేదిక‌గా ప్రారంభం కానుంది.
చదవండి: సౌతాఫ్రికా పేసర్‌ వరల్డ్‌ రికార్డు.. సరికొత్త చరిత్ర

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)