Breaking News

టీ20ల్లో అత్యంత అరుదైన ఘనత సాధించిన సౌతాఫ్రికా బౌలర్‌

Published on Wed, 02/14/2024 - 15:38

సౌతాఫ్రికా వెటరన్‌ బౌలర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ టీ20ల్లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్‌లో 500 వికెట్లు పడగొట్టిన నాలుగో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ప్రపంచ క్రికెట్‌లో తాహిర్‌కు ముందు డ్వేన్‌ బ్రావో (624 వికెట్లు), రషీద​ ఖాన్‌ (556), సునీల్‌ నరైన్‌ (532) 500 వికెట్ల మార్కును తాకారు. 

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024లో రంగ్‌పూర్‌ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న తాహిర్‌.. ఖుల్నా టైగర్స్‌తో నిన్న (ఫిబ్రవరి 13) జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో తాహిర్‌ ఐదు వికెట్ల ఘనత సాధించి, తన జట్టును ఒంటిచేత్తో గెలిచిపించాడు. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన రంగ్‌పూర్‌ రైడర్స్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. షకీబ్‌ అల్‌ హసన్‌ (69), మెహిది హసన్‌ (60) అ‍ర్దసెంచరీలతో రాణించగా.. నురుల్‌ హసన్‌ (32 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. షకీబ్‌ కేవలం 20 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఖుల్నా టైగర్స్‌ బౌలర్లలో లూక్‌ వుడ్‌ 3, నహిద్‌ రాణా, నసుమ్‌ అహ్మద్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన టైగర్స్‌.. ఇమ్రాన్‌ తాహిర్‌ (4-0-26-5), షకీబ్‌ అల్‌ హసన్‌ (3.2-0-30-2), మెహిది హసన్‌ (1/13), హసన్‌ మహమూద్‌ (1/29), జేమ్స్‌ నీషమ్‌ (1/5) ధాటికి 18.2 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. టైగర్స్‌ బౌలర్లలో అలెక్స్‌ హేల్స్‌ (60) ఒక్కడే రాణించాడు. మిగతా బ్యాటర్లు కనీసం 20 పరుగులకు మించి చేయలేకపోయారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)