తొలి టెస్టులో పట్టు బిగిస్తున్న లంకేయులు.. టీమిండియాకు ఊహించని షాక్‌ ఇస్తారా?

Published on Fri, 03/10/2023 - 20:25

క్రైస్ట్‌ చర్చ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పర్యటక శ్రీలంక పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు కీలక వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. క్రీజులో డార్లీ మిచెల్‌(40), బ్రేస్‌వేల్‌(9) పరుగులతో ఆజేయంగా ఉన్నారు. తొలత బ్యాటింగ్‌ పరంగా కివీస్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన శ్రీలంక.. ఇప్పుడు బౌలర్లు కూడా దుమ్ము రేపుతున్నారు.

లంక బౌలర్ల దాటికి కివీస్‌ బ్యాటర్లు వరుస క్రమంలో పెవిలియన్‌కు క్యూ కట్టారు. కాగా శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 355 పరుగుల మెరుగైన స్కోర్‌ సాధించిన సంగతి తెలిసిందే. శ్రీలంక ఇన్నింగ్స్‌లో   కుశాల్ మెండిస్ (87) పరుగలతో కీలక ఇన్నింగ్స్‌ ఆడగా.. కెప్టెన్‌ కరుణరత్నె (50), ఏంజెలో మాథ్యూస్ (47), ధనుంజయ డిసిల్వ (46) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ టిమ్ సౌథీ ఐదు వికెట్లు తీయగా మాట్ హెన్రీ నాలుగు వికెట్లు తీశాడు.

ఒక వేళ ఈ మ్యాచ్‌ శ్రీలంక విజయం సాధిస్తే.. ఆ ప్రభావం వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌ షిఫ్‌ ఫైనల్‌ రేసుపై  పడుతోంది. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్‌ను ఆస్ట్రేలియా ఖారారు చేసుకోగా మరో స్థానం కోసం టీమిండియా,శ్రీలంక జట్లు పోటీ పడుతున్నాయి.

అహ్మదాబాద్‌ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్‌ విజయం సాధించినా, డ్రాగా ముగించినా.. శ్రీలంక గెలుపోటములతో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలై.. కివీస్‌ సిరీస్‌ను శ్రీలంక 2-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేస్తే, అప్పడు లంకేయులు డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగు పెడతారు. కానీ శ్రీలంక కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా ఓడినా చాలు.. వారి డబ్ల్యూటీసీ కథ ముగిస్తోంది.!
చదవండి: IND Vs AUS: చరిత్ర సృష్టించిన ఖవాజా.. 43 ఏళ్ల రికార్డు బద్దలు! ఏకైక ఆటగాడిగా..

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)