Breaking News

IPL 2026: కేకేఆర్‌కు మరో భారీ షాక్‌

Published on Fri, 03/13/2026 - 20:54

ఐపీఎల్‌-2026కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఈ ఏడాది సీజ‌న్‌కు  ఆ జ‌ట్టు స్టార్ ఫాస్ట్ బౌల‌ర్, యువ సంచ‌ల‌నం హ‌ర్షిత్ రాణా మోకాలి గాయం కారణంగా దూరం కానున్న‌ట్లు తెలుస్తోంది. హర్షిత్ గ‌త నెల‌లో సౌతాఫ్రికాతో జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వార్మాప్ మ్యాచ్‌లో గాయ‌ప‌డ్డాడు.

దీంతో త‌న బౌలింగ్ స్పెల్ మ‌ధ్య‌లోనే అత‌డు మైదానాన్ని వీడాడు. ఆ త‌ర్వాత ప‌లు స్కాన్ల త‌ర్వాత అత‌డికి మోకాలి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తేల్చారు. దీంతో రాణా ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో సర్జరీ చేయించుకున్నాడు. అతడు ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నాడు.

అయితే అతడు పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పట్టనున్నట్లు సమాచారం.  ఈ క్రమంలోనే ఐపీఎల్‌-19 సీజ‌న్ మొత్తానికి దూరం కానున్న‌ట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా త‌మ క‌థ‌నంలో పేర్కొంది. హ‌ర్షిత్ త‌న ఐపీఎల్(2022) త‌న అరంగేట్రం నుంచి కేకేఆర్‌కే ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు.

ఐపీఎల్-2024 టైటిల్ కేకేఆర్‌ గెలవడంలో హర్షిత్ కీలక పాత్ర పోషించాడు. గ‌త సీజ‌న్‌లో కూడా హ‌ర్షిత్ 15 వికెట్లతో స‌త్తాచాటాడు. అంతేకాకుండా టీమిండియా త‌ర‌పున కూడా అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌లు క‌న‌బ‌రిచాడు. మ‌రోవైపు ఈ ఏడాది ఐపీఎల్‌కు శ్రీలంక స్పీడ్ స్టార్ మ‌తీషా ప‌తిరాన సైతం గాయం కార‌ణంగా దూర‌మ‌య్యే అవ‌కాశ‌ముంది.

గతేడాది డిసెంబ‌ర్‌లో జ‌రిగిన మినీ వేలంలో ప‌తిరానను రూ.18 కోట్ల‌కు కేకేఆర్ సొంతం చేసుకుంది. కానీ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ సంద‌ర్భంగా ప‌తిరాన కూడా గాయ‌ప‌డ్డాడు. అత‌డు ఇంకా శ్రీలంక‌లోనే ఉన్నాడు. ఇక ఐపీఎల్ నుంచి ఉద్వాస‌న‌కు గురైన బంగ్లాదేశ్ స్పీడ్ స్టార్ ముస్తాఫిజుర్ రెహ్మ‌న్ స్ధానంలో జింబాబ్వే పేస‌ర్ బ్లెస్సింగ్ ముజరబానీని జట్టులోకి కేకేఆర్ తీసుకుంది.
చదవండి: BAN vs PAK: పాకిస్తాన్ ప్లేయర్ వింత రనౌట్‌.. క్రికెట్‌ చరిత్రలోనే!
 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)