Breaking News

పొట్టి క్రికెట్‌లో పెను సంచలనం

Published on Mon, 12/29/2025 - 15:57

పొట్టి క్రికెట్‌లో పెను సంచలనం నమోదైంది. ఈ ఫార్మాట్‌ చరిత్రలో తొలిసారి ఓ బౌలర్‌ 8 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఇప్పటివరకు ఈ ఫార్మాట్‌లో అత్యుత్తమంగా 7 వికెట్ల ప్రదర్శనలు మాత్రమే నమోదయ్యాయి.

తాజాగా మయన్మార్‌తో జరిగిన అంతర్జాతీయ టీ20లో భూటాన్‌ బౌలర్‌ సోనమ్‌ ఎషే (22 ఏళ్ల లెఫ్డ్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌) 8 వికెట్ల చారిత్రక ఫీట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌లో సోనమ్‌ 4 ఓవర్లలో కేవలం 7 పరుగులిచ్చి (ఓ మెయిడిన్‌) ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. సోనమ్‌ నమోదు చేసిన ఈ గణాంకాలు యుగయుగాలు గుర్తుండిపోతాయి.

ఎషే చారిత్రక ప్రదర్శన కారణంగా ఈ మ్యాచ్‌లో మయన్మార్‌పై భూటాన్‌ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భూటాన్‌ 127 పరుగులు చేసింది. అనంతరం 128 పరుగుల ఛేదనలో మయన్మార్‌ 9.2 ఓవర్లలో 45 పరుగులకే ఆలౌటైంది. ఈ గెలుపుతో భూటాన్‌ 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం​ చేసుకుంది.

పొట్టి క్రికెట్‌లో అత్యుత్తమ గణాంకాలు..
సోనమ్‌ ఎషే (భూటాన్‌)- మయన్మార్‌పై 4-1-7-8
శ్యాజ్రుల్‌ ఇద్రుస్‌ (మలేషినా)- చైనాపై 4-1-8-7
అలీ దావూద్‌ (బహ్రెయిన్‌)- భూటాన్‌పై 4-0-19-7
హర్ష భరద్వాజ్‌ (సింగపూర్‌)- మంగోలియాపై 4-2-3-6
పీటర్‌ అహో (నైజీరియా)- సియెర్రా లియోన్‌పై 3.4-1-5-6
దీపక్‌ చాహర్‌ (భారత్‌)- బంగ్లాదేశ్‌పై 3.2-0-7-6

చదవండి: న్యూజిలాండ్‌ సిరీస్‌కు ముందే 'మరోసారి' రంగంలోకి దిగనున్న విరాట్‌ కోహ్లి
 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)