Breaking News

BGT 2023: అలెక్స్‌ క్యారీ వికెట్‌ ప్రత్యేకం.. అశ్విన్‌ అరుదైన రికార్డు

Published on Fri, 02/17/2023 - 14:41

India vs Australia, 2nd Test - Ravichandran Ashwin: టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో వంద వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే(111 వికెట్లు) తర్వాత ఈ ఫీట్‌ నమోదు చేసిన బౌలర్‌గా నిలిచాడు. 

వంద వికెట్ల ఘనత
బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా స్వదేశంలో జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా అశ్విన్‌ ఈ ఘనత సాధించాడు. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా తొలి రోజు ఆటలో ఆసీస్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అలెక్స్‌ క్యారీని డకౌట్‌ చేసి.. ఆస్ట్రేలియాపై వంద వికెట్ల మార్కును అందుకున్నాడు. ఇక సమకాలీన క్రికెటర్లలో రవీంద్ర జడేజా(71) తప్ప అశ్విన్‌ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.

అగ్రస్థానంలో వార్న్‌
ఇదిలా ఉంటే.. ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా దివంగత ఆసీస్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ రికార్డులకెక్కాడు. ఇంగ్లండ్‌తో టెస్టుల్లో అతడు.. 195 వికెట్లు పడగొట్టి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

కాగా రెండో టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.  ఈ క్రమంలో టీ బ్రేక్‌ సమయానికి అశ్విన్‌ మూడు వికెట్లతో చెలరేగగా.. మహ్మద్‌ షమీ 2 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్‌ దక్కింది. ఈ క్రమంలో మూడో సెషన్‌ ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 199(56 ఓవర్లు) చేయగలిగింది. ఇక  క్యారీ కంటే ముందు అశూ.. స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

చదవండి: Tom Blundell: కివీస్‌ బ్యాటర్‌ టామ్‌ బ్లండెల్‌ ప్రపంచ రికార్డు.. ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాలేదు!
IND Vs AUS: పాపం వార్నర్‌.. మళ్లీ షమీ చేతిలోనే! వీడియో వైరల్‌

Videos

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)