Breaking News

తొక్కిసలాట ఘటన.. ఆర్సీబీ మార్కెటింగ్‌ హెడ్‌ అరెస్ట్‌

Published on Fri, 06/06/2025 - 08:52

చిన్న‌స్వామి స్టేడియం వ‌ద్ద జరిగిన తొక్కిసలాట ఘ‌ట‌న విచార‌ణ‌లో బెంగ‌ళూరు పోలీసులు మ‌రో అడుగు ముందుకు వేశారు. సీఎం సిద్ద‌రామ‌య్య ఆదేశాల మెర‌కు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఫ్రాంచైజీ మెనెజ్‌మెంట్‌పై చ‌ర్య‌లకు ఉపక్ర‌మించారు. ఈ క్ర‌మంలో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను శుక్ర‌వారం అరెస్టు చేశారు.

ముంబైకి వెళ్తుండ‌గా బెంగళూరు ఎయిర్‌పోర్టులో అత‌డిని అదుపులోకి తీసుకున్న‌ట్లు సమాచారం. అదేవిధంగా ఈ ఈవెంట్‌ నిర్వాహక సంస్థ డీఎన్ఎ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ముగ్గురు సిబ్బందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

నిఖిల్ సోసాలేను పోలీసులు ప్రస్తుతం రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అతడి అరెస్ట్‌పై ఆర్సీబీ యాజమాన్యం ఇప్పటివరకు ఇంకా స్పందించలేదు. కాగా బుధ‌వారం (జూన్ 4) జరిగిన తొక్కిసలాటలో 11మంది మృతిచెందారు. దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారు.

ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసలే అరెస్ట్

ఇక ఈ ఘటనపై గురువారం విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  కనీస ఏర్పాట్లు లేకుండా ఈవెంట్‌ ఎలా నిర్వహిస్తారని చీఫ్ జస్టిస్‌తో కూడిన ధర్మాసనం మండిపడింది. ఈ ఘటన వెనుక కారణాలను తేల్చాలని సిద్దరామయ్య సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. 

దీంతో కర్ణాటక  ప్రభుత్వం సీఐడీ పోలీసులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది. 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కాగా ఇప్ప‌టికే బెంగళూరు న‌గ‌ర పోలీస్‌ కమిషనర్‌ బి.దయానంద్, డీసీపీ శేఖర్, ఇన్‌స్పెక్టర్‌ గిరీశ్‌లపై ప్ర‌భుత్వం సస్పెన్ష‌న్ వేటు వేసింది
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్-భారత్ టెస్టు సిరీస్‌కు కొత్త పేరు ఖరారు


 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి