మాటలు రావడం లేదు.. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై విరుష్క

Published on Thu, 06/05/2025 - 08:42

బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విక్టరీ పరేడ్‌ సెలబ్రేషన్స్‌ తీవ్ర విషాదాన్ని నింపాయి. బుధవారం నగరంలోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో తొక్కిసలాట జరిగింది. 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 47 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై ఆర్సీబీ స్టార్‌ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  

‘‘మాటలు రావడం లేదు. తీవ్ర మనోవేదనకు గురయ్యాను. ఈ ఘ‌ట‌న న‌న్ను తీవ్రంగా క‌లిచివేసింది‘ అంటూ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశాడు. మరోవైపు ఈ ఘటనపై ఆర్‌సీబీ ఫ్రాంచైజీ స్పందించింది. ఈ తొక్కిసలాటలో మరణించిన వారికి సంతాపం ప్రకటించింది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేసింది. 

‘‘చిన్నస్వామి స్టేడియం బయట చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పట్ల మేం తీవ్రంగా కలత చెందాం. ఈ మధ్యాహ్నం జట్టు రాకను అంచనా వేస్తూ బెంగళూరు అంతటా అభిమానులు భారీ ఎత్తున గుమిగూడారు. అయితే మీడియా ద్వారా మేం ఈ దురదృష్టకర సంఘటన గురించి తెలుసుకున్నాం. ప్రతీ ఒక్కరి భద్రత, శ్రేయస్సు మాకు అత్యంత ముఖ్యం. ఈ విషాద ఘటనలో మృతి చెందిన వారికి ఆర్సీబీ సంతాపం తెలుపుతోంది. వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. ప్రాణ నష్టం మమ్మల్ని మరింత కలిచి వేసింది. ఈ సంఘటన గురించి మా దృష్టికి వచ్చిన వెంటనే మా కార్యక్రమాన్ని ఆపేసాం. స్థానిక అధికారుల మార్గదర్శకత్వం, సలహాలను పాటించే ఈ వేడుకలను నిర్వహించాం. అభిమానులంతా సురక్షితంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం.’’అని తెలిపింది. మరోవైపు ఇదే ప్రకటనను కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సైతం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

ఐపీఎల్‌లో 18 ఏళ్ల నిరీక్షణ ఫలించి, ఆర్సీబీ తొలిసారి టైటిల్ కప్‌ కైవసం చేసుకోవడంతో అసంఖ్యాక అభిమానులు సంబరాల్లో పాల్గొనేందుకు తరలివచ్చారు. వాస్తవానికి ఆర్సీబీ యాజమాన్యం విధానసౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి, ఆ తర్వాత సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని ప్రకటించింది. అయితే, ఉదయం ఆలస్యంగా ట్రాఫిక్ పోలీసులు ర్యాలీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో అప్పటికే భారీగా చేరుకున్న అభిమానుల్లో మరింత గందరగోళం నెలకొంది. బుధవారం మధ్యాహ్నానికే విధానసౌధ, ఎంజీ రోడ్, చర్చ్ స్ట్రీట్ పరిసర ప్రాంతాలకు సుమారు రెండు లక్షల మంది అభిమానులు చేరుకున్నారని ఒక అంచనా. ఈ అంచనా పోలీసుల అంచనాని మించిపోయి వాళ్ల చేతులు దాటిపోయింది. 

అదే సమయంలో.. ఏడో నెంబర్‌ గేటు దగ్గర విపరీతమైన రద్దీ,  ఫ్రీ టికెట్‌ పుకార్లు, వర్షం, స్టేడియంలో జనాల బరువుకు కాలువ పైకప్పు కుప్పకూలిపోవడం.. ఇలా ఒకేసారి అన్నింటితో పరిస్థితి అదుపుతప్పడంతో తీవ్రమైన తొక్కిసలాటకు కారణమైందని పోలీసులు అంటున్నారు. 

మరోవైపు ఈ ఘటనకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్(కేఎస్‌సీఏ) కారణమనే విమర్శ బలంగా వినిపిస్తోంది. అయితే ఈ ఘటనపై కేఎస్‌సీఏ విచారం వ్యక్తం చేసింది. ’చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విజయోత్సవ వేడుకల సందర్భంగా చోటు చేసుకున్న దురదృష్ట ఘటనపై ఆర్‌సీబీ, కేఎస్‌సీఏ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. మృతులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది.’అని ఓ ప్రకటనను విడుదల చేసింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల రూపాయలు అందజేస్తామని కేఎస్‌సీఏ ప్రకటించింది. 

ఇక.. ఈ దుర్ఘటనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పందించింది. అది తమ ఈవెంట్‌ కాదని, అయితే నిర్వహణలో లోపాలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. నిర్వాహకుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఎన్డీటీవీతో మాట్లాడుతూ అన్నారు. "పూర్తి వాస్తవాలు తెలియకుండా నేను ఇప్పుడు ఎవరినీ నిందించదలచుకోలేదు. గత ఏడాది వెస్టిండీస్‌లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు ముంబైలో బీసీసీఐ విజయోత్సవ సభ నిర్వహించినప్పుడు, స్థానిక క్రికెట్ సంఘం, ముంబై పోలీసులు, అగ్నిమాపక దళం, విపత్తు నిర్వహణ బృందాలతో కలిసి పక్కా ప్రణాళిక రచించాం. లక్షలాది మంది హాజరైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. అన్ని నిబంధనలు పాటించాం" అని సైకియా తెలిపారు.

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)