Breaking News

చాలా చాలా బాధ‌గా ఉంది.. మా క‌ల చెదిరిపోయింది: బెన్‌ స్టోక్స్‌

Published on Sun, 12/21/2025 - 11:43

యాషెస్ సిరీస్ 2025-26ను మ‌రో రెండు మ్యాచ్‌లు మిగిలూండ‌గానే 3-0 తేడాతో ఇంగ్లండ్ కోల్పోయింది. అడిలైడ్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన మూడో టెస్టులో 82 ప‌రుగుల తేడాతో ఓట‌మి చ‌విచూసిన ఇంగ్లండ్ జ‌ట్టు.. ఈ ఘోర ప‌ర‌భావాన్ని మూట క‌ట్టుకుంది. 435 పరుగుల భారీ లక్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్ త‌మ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 352 ర‌న్స్‌కు ఆలౌటైంది.

లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే (85) అద్భుతంగా పోరాడినప్పటికీ.. మిడిలార్డర్ నుంచి ఆశించిన సహకారం లభించలేదు. ఆఖరిలో జామీ స్మిత్‌(60), విల్ జాక్స్‌(47), కార్స్‌(39 నాటౌట్‌) జట్టును గెలిపించేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్‌, మిచెల్ స్టార్క్‌, లియోన్ త‌లా మూడు వికెట్ల‌తో ఇంగ్లీష్ జ‌ట్టు ఓట‌మిని శాసించారు.

"సిరీస్‌ను ఎలాగైనా కాపాడుకోవాల‌నే ల‌క్ష్యంతో అడిలైడ్‌లో అడుగుపెట్టాము. కానీ మా క‌ల ఇప్పుడు చెదిరిపోయింది.  ఈ ఓట‌మి జ‌ట్టులోని ప్ర‌తీ ఒక్క‌రిని ఎంతో బాధకు గురి చేస్తోంది. చాలా చాలా ఎమోషనల్‌గా ఉన్నారు. ఆస్ట్రేలియాకు క‌చ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే.  గెలుపు అనేది మూడు విభాగాల్లో రాణించడంపై ఆధారపడి ఉంటుంది.

ఈ మ్యాచ్‌లో ఆసీస్ మాకంటే మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేసింది. వారు బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్ మూడింటిలోనూ మాపై పైచేయి సాధించారు. నాలుగో ఇన్నింగ్స్‌లో మా ముందు భారీ ల‌క్ష్యం ఉన్న‌ప్ప‌టికి మేము ఆఖ‌రివ‌ర‌కు పోరాడాము. విల్ జాక్స్, జేమీ స్మిత్ ఆడిన తీరు చూసి మేము గెలుస్తామని భావించాను. కానీ అది సాధ్యం కాలేదు.

 టాస్ ఓడిన‌ప్ప‌టికి ఆసీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో ఓ మోస్తార్ స్కోర్‌కే క‌ట్ట‌డి చేయ‌డంలో మేము విజ‌యవంత‌మ‌య్యాము. అయితే ఆ త‌ర్వాత మేము భారీ స్కోర్ చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యాము. రెండో ఇన్నింగ్స్‌లో కూడా కేవ‌లం 60 ప‌రుగుల వ్య‌వ‌ధిలో 6 వికెట్లు ప‌డ‌గొట్టాము. మాకు చాలా సానుకూల ఆంశాలు ఉన్నాయి. 

ముఖ్యంగా మా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు చూపిన పోరాటపటిమ నిజంగా అద్బుతం. నేను  ఆశించిన పట్టుదల వారిలో క‌న్పించింది. సిరీస్ కోల్పోయిన‌ప్ప‌టికి మిగిలిన రెండు టెస్టుల్లో విజయం సాధించించేందుకు ప్ర‌య‌త్నిస్తాము" అని పోస్ట్ మ్యాచ్ కాన్ఫ‌రెన్స్‌లో స్టోక్స్ పేర్కొన్నాడు.
చదవండి: సంజూ శాంస‌న్ కీల‌క నిర్ణ‌యం

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)