'అందుకే' మందు మానేశా: స్టార్‌ క్రికెటర్‌

Published on Tue, 05/20/2025 - 10:03

లండన్‌: ఇంగ్లండ్‌ టెస్టు జట్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ ఐదు నెలల విరామం తర్వాత మళ్లీ మైదానంలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. తరచు గాయాల బారిన పడుతూ మళ్లీ మళ్లీ ఆటకు దూరమవుతున్న 33 ఏళ్ల స్టోక్స్‌ గత ఏడాది డిసెంబర్‌ తర్వాత అసలు ఏ స్థాయి మ్యాచ్‌ కూడా ఆడలేదు. తొడ కండరాల గాయంతో తప్పుకున్న అతను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. 

వేగంగా ఫిట్‌నెస్‌ అందుకునే క్రమంలో భాగంగా ‘రీహాబిలిటేషన్‌’ సమయంలో మద్యానికి దూరంగా ఉన్నట్లు వెల్లడించాడు. ‘నాకు తొలిసారి గాయమైనప్పుడు నా శరీరం చికిత్సకు సరిగా స్పందించలేదు. ఇది ఎలా జరిగిందని ఆలోచిస్తే వారం రోజుల క్రితం బాగా మద్యం తాగిన విషయం గుర్తుకొచి్చంది. బహుశా అది కూడా కారణం కావచ్చనిపించింది. 

దాంతో ఈసారి గాయం తర్వాత చాలా జాగ్రత్తగా ఉన్నాను. నేను మారితే మంచిదని భావించా. అయితే పూర్తిగా అది సాధ్యం కాదు కాబట్టి రీహాబిలిటేషన్‌ వరకు నియంత్రణలో ఉండేందుకు ప్రయత్నించా. మైదానంలోకి దిగే వరకు దీనిని పాటించాలని ప్రయతి్నస్తున్నా. అందుకే ఈ ఏడాది జనవరి నుంచి మద్యం మానేశా. అప్పటి నుంచి ఇప్పటి వరకు దానిని ముట్టలేదు’ అని స్టోక్స్‌ చెప్పాడు. గురువారం నుంచి జింబాబ్వేతో జరిగే ఏకైక టెస్టులో బరిలోకి దిగనున్న స్టోక్స్‌...ఆ తర్వాత భారత్‌తో టెస్టు సిరీస్, యాషెస్‌ సిరీస్‌ కోసం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)