Breaking News

ఇంగ్లండ్‌ జట్టుకు అతి భారీ షాక్‌

Published on Sun, 12/22/2024 - 16:53

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025, దానికి ముందు టీమిండియాతో జరిగే కీలకమైన వైట్‌బాల్‌ సిరీస్‌లకు ముందు ఇంగ్లండ్‌ జట్టుకు అతి భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్థార్‌ ఆటగాడు, టెస్ట్‌ జట్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ గాయం కారణంగా పై రెండు ఈవెంట్‌లకు దూరమయ్యాడు. 33 ఏళ్ల స్టోక్స్‌ ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌ సందర్భంగా హ్యామ్‌స్ట్రింగ్‌ ఇంజ్యూరికి గురయ్యాడు. భారత్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌, యాషెస్‌ సిరీస్‌ 2025-26 దృష్ట్యా స్టోక్స్‌కు విశ్రాంతి కల్పించారని తెలుస్తుంది.

కాగా, ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025, దానికి ముందు టీమిండియాతో జరిగే వైట్‌బాల్‌ సిరీస్‌ల కోసం ఇంగ్లండ్‌ జట్టును ఇవాళ (డిసెంబర్‌ 22) ప్రకటించారు. వన్డే, టీ20 జట్లకు కెప్టెన్‌గా జోస్‌ బట్లర్‌ ఎంపికయ్యాడు. టెస్ట్‌ జట్టు కీలక​ సభ్యుడు జో రూట్‌, 2023 వన్డే ప్రపంచకప్‌ తర్వాత తొలి సారి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఫాస్ట్‌ బౌలర్‌ మార్క్‌ వుడ్‌ వన్డే, టీ20 జట్లలో చోటు దక్కించుకున్నాడు. వికెట్‌కీపర్లు జేమీ స్మిత్‌, ఫిల్‌ సాల్ట్.. రైజింగ్‌ స్టార్‌ జేకబ్‌ బేతెల్‌ కూడా ‌రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు.

భారత్‌తో సిరీస్‌లు, ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఇంగ్లండ్‌ జట్టు హెడ్‌ కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ వ్యవహరిస్తాడు. ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల జట్ల హెడ్‌ కోచ్‌గా మెక్‌కల్లమ్‌కు ఇవే తొలి అసైన్‌మెంట్స్‌ అవుతాయి. ఇప్పటివరకు మెక్‌కల్లమ్‌ కేవలం టెస్ట్‌ జట్టుకు మాత్రమే హెడ్‌ కోచ్‌గా ఉన్నాడు.

భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌ మరియు ఛాంపియన్స్‌ ట్రోఫీల కోసం ఇంగ్లండ్‌ జట్టు..
జోస్‌ బట్లర్‌ (కెప్టెన్‌), జోఫ్రా ఆర్చర్‌, గస్‌ అట్కిన్సన్‌, జేకబ్‌ బేతెల్‌, హ్యారీ బ్రూక్‌, బ్రైడన్‌ కార్స్‌, బెన్‌ డకెట్‌, జేమీ ఓవర్టన్‌, జేమీ స్మిత్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, ఆదిల​్‌ రషీద్‌, జో రూట్‌, సకీబ్‌ మహమూద్‌, ఫిల్‌ సాల్ట్‌, మార్క్‌ వుడ్‌

భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ జట్టు..
జోస్‌ బట్లర్‌ (కెప్టెన్‌), రెహాన్‌ అహ్మద్‌, జోఫ్రా ఆర్చర్‌, గస్‌ అట్కిన్సన్‌, జేకబ్‌ బేతెల్‌, హ్యారీ బ్రూక్‌, బ్రైడన్‌ కార్స్‌, బెన్‌ డకెట్‌, జేమీ ఓవర్టన్‌, జేమీ స్మిత్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, ఆదిల్‌ రషీద్‌, సకీబ్‌ మహమూద్‌, ఫిల్‌ సాల్ట్‌, మార్క్‌ వుడ్‌

భారత్‌లో ఇంగ్లండ్‌ పర్యటన షెడ్యూల్‌ వివరాలు..
జనవరి 22- తొలి టీ20 (కోల్‌కతా)
జనవరి 25- రెండో టీ20 (చెన్నై)
జనవరి 28- మూడో టీ20 (రాజ్‌కోట్‌)
జనవరి 31- నాలుగో టీ20 (పూణే)
ఫిబ్రవరి 2- ఐదో టీ20 (ముంబై)

ఫిబ్రవరి 6- తొలి వన్డే (నాగ్‌పూర్‌)
ఫిబ్రవరి 9- రెండో వన్డే (కటక్‌)
ఫిబ్రవరి 12- మూడో వన్డే (అహ్మదాబాద్‌)

ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌, పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ జట్లు పోటీపడనున్నాయి. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్తాన్‌ వేదికగా జరుగనుంది. టోర్నీకి సంబంధించిన మ్యాచ్‌ తేదీలను, వేదికలను ప్రకటించాల్సి ఉంది. ఈ టోర్నీలో భారత్‌ ఆడే మ్యాచ్‌లు తటస్థ వేదికలపై జరుగనున్నాయి. 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)