Breaking News

బెన్‌ స్టోక్స్‌ సరికొత్త అవతారం.. ఎవ‌రూ ఊహించి ఉండరు!

Published on Thu, 08/07/2025 - 16:38

టీమిండియాతో టెస్టు సిరీస్ ముగియ‌డంతో ఇంగ్లండ్ ఆట‌గాళ్లు ది హండ్రెడ్ లీగ్‌-2025లో బీజీ బీజీగా గ‌డ‌ప‌నున్నారు. ఓలీ పోప్‌, జో రూట్‌, హ్యారీ బ్రూక్‌, బెన్ డ‌కెట్‌, స్మిత్, క్రాలీ వంటి స్టార్ ఆట‌గాళ్లు త‌మ త‌మ జ‌ట్ల‌కు ప్రాతినిథ్యం వ‌హించనున్నారు. అయితే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రం స‌రికొత్త పాత్రలో కన్పించ‌నున్నాడు.

మెంటార్‌గా బెన్ స్టోక్స్‌.. 
ఈ మెగా టోర్నీలో నార్తర్న్ సూపర్‌చార్జర్స్ జ‌ట్టు మెంటార్‌గా స్టోక్స్ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఈ విష‌యాన్ని సూపర్‌చార్జర్స్ ఫ్రాంచైజీ గురువారం ధ్రువీక‌రించింది. కాగా ఈ ఏడాది ఆరంభంలోనే స్టోక్స్‌ ఫిట్‌నెస్‌, వ‌ర్క్‌లోడ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా ది హాండ్రిడ్ లీగ్‌-2025 త‌ప్పుకొంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

కానీ ఇప్పుడు ఆట‌గాడిగా కాకుండా మెంటార్‌గా స్టోక్స్ త‌న సేవ‌ల‌ను  నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఫ్రాంచైజీకి అందించ‌నున్నాడు. స్టోక్స్ నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఫ్రాంచైజీ కొత్తేమి కాదు. ఇంత‌కుముందు 2021-24 వ‌ర‌కు సూప‌ర్ ఛార్జ‌ర్స్ జెర్సీలో స్టోక్స్ క‌న్పించాడు. మొత్తంగా ఐదు మ్యాచ్‌లు ఆడి తొమ్మిది ప‌రుగుల‌తో పాటు ఓ వికెట్ సాధించాడు.

ఫిట్‌నెస్ స‌మ‌స్య‌ల కార‌ణంగా స్టోక్స్ ఎక్కువ‌గా మ్యాచ్‌లు ఆడ‌లేకపోయాడు. స్టోక్సీ ఇప్ప‌టికి గాయాల‌తో స‌త‌మ‌త‌మవుతున్నాడు. భుజం గాయం కార‌ణంగా భార‌త్‌తో జ‌రిగిన ఆఖరి టెస్టుకు స్టోక్స్ దూర‌మ‌య్యాడు. అత‌డు టోర్నీ నుంచి త‌ప్ప‌కొన్న‌ప్ప‌టికి త‌న అనుభ‌వాన్ని ఉప‌యోగించుకోవాల‌ని సూప‌ర్ ఛార్జ‌ర్స్ యాజ‌మాన్యం నిర్ణ‌యించ‌కుంది.

అందుకే తమ జట్టు మెంటార్ ఈ గ్రేట్ ఆల్‌రౌండ‌ర్‌ను నియ‌మించింది. హ్యారీ బ్రూక్ సార‌థ్యంలోని సూప‌ర్ చార్జ‌ర్స్ జ‌ట్టు త‌మ తొలి మ్యాచ్‌లో ఆగ‌స్టు 7న వెల్ష్‌ఫైర్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఇక ఇది ఇలా ఉండ‌గా.. భార‌త్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో స్టోక్స్ ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టాడు. ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన స్టోక్స్‌.. 43.43 స‌గ‌టుతో 304 ప‌రుగులు చేశాడు. అంతేకాకుండా 17 వికెట్లు ప‌డ‌గొట్టాడు.
చదవండి: IND vs WI: టీమిండియాకు భారీ షాక్‌!

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)