Ben Stokes: ఆలస్యమైనా కుంభస్థలాన్ని గట్టిగా బద్దలు కొట్టాడు

Published on Mon, 11/14/2022 - 08:44

టి20 ప్రపంచకప్‌లో ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్‌ రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఇంగ్లండ్‌ విజయంలో ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ పాత్ర కీలకం. ఇ‍న్నింగ్స్‌లో చివరి వరకు మూలస్తంభంలా నిలబడిన స్టోక్స్‌ 49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 52 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు.

అయితే ఇక్కడ మనకు తెలియని విషయమేంటంటే.. స్టోక్స్‌ టి20 కెరీర్‌లో ఇదే తొలి అర్థసెంచరీ కావడం. 48 టి20 మ్యాచ్‌ల కెరీర్‌లో స్టోక్స్‌ ఇంతవరకు ఒక్క హాఫ్‌ సెంచరీ కొట్టలేకపోయాడు. దీనికి చాలా కారణాలున్నాయి. స్టోక్స్‌ ఎక్కువగా ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. ఈ మధ్య కాలంలో ఇంగ్లండ్‌ టాపార్డర్‌ చాలా వరకు మ్యాచ్‌లను పూర్తి చేస్తూ రావడంతో స్టోక్స్‌ ఎక్కువగా అవకాశాలు రాలేదు. 

ఈసారి మాత్రం టాపార్డర్‌ విఫలం కావడంతో తనలోని బ్యాటర్‌ను బయటకు తీశాడు బెన్‌ స్టోక్స్‌. పరిస్థితులకు అనుగుణంగా ఆడుతూ ఆల్‌రౌండర్‌ అనే పదానికి నిర్వచనం చెప్పాడు. ఎట్టకేలకు టి20 ప్రపంచకప్‌లో అదీ ఫైనల్లో తొలి అర్థసెంచరీ చేయడమే గాక జట్టున విశ్వవిజేతగా నిలిపిన ఘనత స్టోక్స్‌కే దక్కుతుంది. 2009లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన స్టోక్స్‌ అనతికాలంలో గొప్ప ఆల్‌రౌండర్లలో ఒకడిగా పేరు పొందాడు.

2019 వన్డే వరల్డ్‌కప్‌ గెలవడంలో స్టోక్స్‌దే కీలకపాత్ర. ఆనాటి ఫైనల్లో అతను ఆడిన 84 పరుగుల ఇన్నింగ్స్‌ ఇంగ్లండ్‌ను విజేతగా నిలిపింది. తాజాగా మరోసారి ఆఖరి వరకు క్రీజులో నిలిచి పొట్టి ఫార్మాట్‌లో రెండోసారి ఇంగ్లండ్‌ను విజేతగా నిలిపాడు. స్టోక్స్‌ ఇప్పటివరకు ఇంగ్లండ్‌ తరపున 86 టెస్టులు, 105 వన్డేలు, 48 టి20 మ్యాచ్‌లు ఆడాడు.ఇక టి20, టెస్టులపై దృష్టి సారించేందుకు స్టోక్స్‌ ఈ ఏడాది ఆరంభంలో వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

చదవండి: Ben Stokes: అప్పుడు విలన్‌.. ఇప్పుడు హీరో

Videos

రెడ్ బుక్ ఆర్డర్.. పోలీసులు జీ హుజూర్

రియల్ సైకో! తొందర పడకు..

పవన్ కు ప్రతి నెల 70 కోట్ల ప్యాకేజీ!

Watch Live: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నిక

రైలు ప్రమాదంపై YS జగన్ దిగ్భ్రాంతి

ల్యాప్‌టాప్‌ల కోసం ఎగవడ్డ జనం

జిల్లాల పునర్విభజన వెనుక బాబు మాస్టర్ ప్లాన్!

మందు కొట్టి.. పోలీసులను కొట్టి.. నేవీ ఆఫీసర్ రచ్చ రచ్చ

అల్లు అర్జున్ కు ఓ న్యాయం.. చంద్రబాబుకు ఓ న్యాయమా ?

Photos

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు