Breaking News

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియా స్టార్‌ బౌలర్‌ రీ ఎంట్రీ!

Published on Sat, 06/24/2023 - 14:08

టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా త్వరలోనే మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో బుమ్రా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా వెస్టిండీస్‌ టూర్‌ తర్వాత భారత జట్టు ఐర్లాండ్‌ పర్యటన వెళ్లనుంది. 

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆతిథ్య ఐర్లాండ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్‌ ఆగస్టులో జరగనుంది. అయితే ఈ ఏడాది ఆగస్టు ఆఖరిలో ఆసియాకప్‌ జరగనుండడంతో.. భారత ద్వితీయ శ్రేణి జట్టు వెళ్లే ఛాన్స్‌ ఉంది. ఈ జట్టుతో పాటు బుమ్రాను కూడా ఐర్లాండ్‌కు పంపాలని భారత జట్టు మెనెజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం.

కాగా వెన్ను గాయం నుంచి కోలుకున్న బుమ్రా.. ప్రస్తుతం నెషనల్‌ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. అతడిని వన్డే వరల్డ్‌కప్‌ సమయానికి సిద్దం చేసే పనిలో భారత జట్టు మెనెజ్‌మెంట్‌ పడింది. ఈ క్రమంలో వీలైనంత వేగంగా బరిలోకి దించాలని మెనెజ్‌మెంట్‌ భావిస్తోంది. కాగా గతేడాది సెప్టెంబర్‌ నుంచి బుమ్రా జట్టుకు దూరంగా ఉన్నాడు.
చదవండి: #Cheteshwar Pujara: వందకు పైగా టెస్టులు ఆడాడు.. మీరు ఇచ్చే గౌరవం ఇదేనా?

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)