Breaking News

శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ..

Published on Mon, 06/02/2025 - 11:00

ఐపీఎల్‌-2025 సీజ‌న్ ఫైన‌ల్లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో త‌ల‌ప‌డే జ‌ట్టు ఏదో తేలిపోయింది. ఆదివారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్‌-2లో ముంబై ఇండియ‌న్స్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్‌.. తుది పోరుకు ఆర్హ‌త సాధించింది.

మంగ‌ళ‌వారం(జూన్ 3)న జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్లో ఆర్సీబీ, పంజాబ్ తొలి టైటిల్ కోసం అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇక ఇది ఇలా ఉండ‌గా.. గెలుపు జోష్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు భారీ షాక్ త‌గిలింది. ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేటు మెయింటిన్ చేసినందుకుగానూ అయ్య‌ర్‌కు బీసీసీఐ జ‌రిమానా విధించింది. 

ఈ ఏడాది సీజ‌న్‌లో పంజాబ్ స్లో ఓవ‌ర్ రేట్‌ను న‌మోదు చేయ‌డం ఇది రెండోసారి. దీంతో  ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం అయ్య‌ర్‌కు రూ.24 ల‌క్ష‌ల ఫైన్ విధించారు. "శ్రేయస్‌ అయ్యర్‌కు జరిమానా విధించాం. న‌రేంద్ర మోడీ స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నాము. ఇది రెండో సారి అయినందున ఆర్టికల్ 2.22 ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్ ప్రకారం శ్రేయ‌స్‌కు రూ. 24 లక్షలు ఫైన్ వేశాము.

మిగిలిన సభ్యులకు ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం, ఇందులో ఏది తక్కువైతే అది జరిమానా విధించ‌డం జ‌రిగింది’ అని ఐపీఎల్ అధికారులు వెల్ల‌డించారు. కాగా ఈ మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. అయ్య‌ర్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌ల‌తో 87 ప‌రుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా 204 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌ కేవలం 19 ఓవర్లలోనే చేధించింది.
చదవండి: అతడొక అత్యద్భుతం.. మేము అనుకున్న‌ది జ‌ర‌గలేదు: హార్దిక్‌

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)