Breaking News

'అమ్మ.. నీ ప్రార్థనలు ఫలించాయి; చల్లగా ఉండు బిడ్డా'

Published on Sun, 07/23/2023 - 09:32

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తరపున ముకేశ్‌ కుమార్‌ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. కాగా కిర్క్‌ మెకెంజీ రూపంలో ముకేశ్‌ కుమార్‌ తొలి అంతర్జాతీయ వికెట్‌ సాధించాడు. 32 పరుగులు చేసిన మెకెంజీ ముకేశ్‌ బౌలింగ్‌లో ఇషాన్‌ కిషన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

టీమిండియా తరపున అంతర్జాతీయ అరేగంట్రం చేసిన 395వగా ఆటగాడిగా ముఖేష్‌ కుమార్‌ నిలిచాడు.కాగా దాదాపు ఏడాది నుంచి భారత జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికీ.. ప్లేయింగ్‌ ఎలెవన్‌లో మాత్రం ముఖేష్‌ కుమార్‌కు చోటు దక్కడం లేదు. అయితే రెండో టెస్టుకు గాయం కారణంగా పేసర్‌ శార్ధూల్‌ ఠాకూర్‌ దూరం కావడంతో.. ముఖేష్ ఎంట్రీకి మార్గం సుగమమైంది.

ఇదిలా ఉంటే టీమిండియా తరపున తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న ముకేశ్‌కుమార్‌ ఈ విషయాన్ని తన తల్లికి ఫోన్‌కాల్‌లో తెలియజేస్తూ ఎమోషనల్‌ అయ్యాడు. ''హలో అమ్మా.. నీ ప్రార్థనలకు ఈరోజు సమాధానం దొరికింది. ఎట్టకేలకు దేశం తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చిందంటూ తల్లితో పేర్కొన్నాడు. ముకేశ్‌ తల్లి స్పందిస్తూ.. సంతోషంగా ఉండు.. కెరీర్‌లో ఎదిగే ప్రయత్నం చెయ్యు.. నా దీవెనలు ఎప్పుడు నీ వెంట ఉంటాయి'' అంటూ పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ వీడియో రూపంలో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది.

2015లో బెంగాల్ తరపున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి ముఖేష్‌ అడుగుపెట్టాడు.  2018-19 రంజీ సీజన్‌లో తన సత్తా ఎంటో క్రికెట్‌ ప్రపంచానికి ముఖేష్‌ తెలియజేశాడు. ఆ సీజన్‌లో  కర్ణాటకతో జరిగిన సెమీఫైనల్లో 6 వికెట్లు పడగొట్టి.. బెంగాల్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ఆ తర్వాత ముఖేష్‌ తన కెరీర్‌లో వెనక్కి తిరిగి చూడలేదు.

తన ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 39 మ్యాచ్‌లు ఆడిన అతడు 149 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌-2023 మినీ వేలంలో రూ. 20 లక్షల బేస్‌ ప్రైజ్‌తో వచ్చిన అతడిని ఢిల్లీ క్యాపిటల్స్‌ ఏకంగా 5.5 కోట్ల రూపాయాలకు అతడిని కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 7 వికెట్లు మాత్రమే సాధించాడు. అనంతరం  డబ్ల్యూటీసీ ఫైనల్‌- 2023కి స్టాండ్‌ బైగా కూడా ఎంపికయ్యాడు.

చదవండి: #HarmanpreetKaur: 'డేర్‌ అండ్‌ డాషింగ్‌' హర్మన్‌ప్రీత్‌.. కుండ బద్దలయ్యేలా!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)