ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌!.. ఆశిష్‌ నెహ్రానూ వదల్లేదు

Published on Wed, 05/07/2025 - 12:21

ఓటమి బాధలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya)తో పాటు జట్టు మొత్తానికి జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్‌ పాలక మండలి ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్‌-2025 (IPL 2025)లో భాగంగా ముంబై మంగళవారం గుజరాత్‌ టైటాన్స్‌ (MI Vs GT)తో తలపడింది.

ప్లే ఆఫ్స్‌ రేసులో సాఫీగా ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు తేలిపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 155 పరుగులకు హార్దిక్‌ సేన పరిమితమైంది.

గెలిచిన గుజరాత్‌
ఇక గుజరాత్‌ లక్ష్య ఛేదనకు దిగగా పదే పదే వర్షం అంతరాయం కలిగించింది. అయితే, ఎట్టకేలకు అర్ధరాత్రి తర్వాత వాన తెరిపినవ్వడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 19 ఓవర్లలో 147 పరుగులు చేయాల్సి ఉండగా.. గుజరాత్‌ పని పూర్తి చేసింది. ముంబైపై మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది.

కాగా ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో బౌలింగ్‌ కోటా పూర్తి చేయలేకపోయింది. దీంతో స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసిన కారణంగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI).. ముంబై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాకు భారీ జరిమానా విధించింది.

రూ. 24 లక్షల ఫైన్‌
ఈ సీజన్‌లో రెండోసారి ఇదే తప్పిదాన్ని పునరావృతం చేసినందుకు హార్దిక్‌కు రూ. 24 లక్షల ఫైన్‌ వేసింది. అదే విధంగా.. నిబంధనల ప్రకారం.. ఇంపాక్ల్‌ ప్లేయర్‌ సహా తుదిజట్టులోని ఆటగాళ్ల అందరికి రూ. 6 లక్షల జరిమానా లేదా వారి మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నట్లు తెలిపింది. ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే అది జరిమానాగా వర్తిస్తుందని వెల్లడించింది.

మరోవైపు గుజరాత్‌ టైటాన్స్‌ హెడ్‌కోచ్‌ ఆశిష్‌ నెహ్రాకు కూడా ఎదురుదెబ్బ తగిలింది. అతడికి కూడా జరిమానా విధిస్తున్నట్లు​ ఐపీఎల్‌ పాలక మండలి తెలిపింది.

ఆశిష్‌ నెహ్రాను వదల్లేదు
ఈ మేరకు.. ‘‘ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిలోని నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ గుజరాత్‌ టైటాన్స్‌ హెడ్‌కోచ్‌ ఆశిష్‌ నెహ్రా మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నాం. అదే విధంగా అతడి ఖాతాలో ఓ డిమెరిట్‌ పాయింట్‌ జత చేస్తున్నాం’’ అని ఐపీఎల్‌ పాలక మండలి తమ ప్రకటనలో పేర్కొంది.

ఐపీఎల్‌ నియమావళిలోని ఆర్టికల్‌ 2.20 ప్రకారం ఆశిష్‌ నెహ్రా లెవల్‌ 1 తప్పిదానికి పాల్పడ్డాడని.. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినందుకు ఈ మేర చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. నెహ్రా కూడా తన తప్పును అంగీకరించాడని పేర్కొంది. 

అయితే, నెహ్రా ఏం తప్పు చేశాడన్న విషయంపై మాత్రం  స్పష్టతనివ్వలేదు. కాగా వర్షం వల్ల పదే పదే మ్యాచ్‌ టైమింగ్‌ను మార్చడంపై మైదానంలోనే నెహ్రా అంపైర్లతో వాదనకు దిగాడు. అందుకే అతడికి జరిమానా వేసినట్లు తెలుస్తోంది.

ఐపీఎల్‌-2025: ముంబై వర్సెస్‌ గుజరాత్‌
👉వేదిక: వాంఖడే, ముంబై
👉టాస్‌: గుజరాత్‌.. తొలుత బౌలింగ్‌
👉ముంబై స్కోరు: 155/8 (20)
👉గుజరాత్‌ స్కోరు: 147/7 (19)
👉ఫలితం: డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతి ప్రకారం ముంబైపై మూడు వికెట్ల తేడాతో గుజరాత్‌ గెలుపు

చదవండి: టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్‌ మా బౌలర్లకే: ఓటమిపై హార్దిక్‌

 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)