Breaking News

మహిళల ప్రపంచకప్‌ కోసం...

Published on Wed, 03/19/2025 - 04:05

న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్‌ ఆతిథ్యమివ్వబోయే మహిళల వన్డే ప్రపంచకప్‌ కోసం ఆర్గనైజింగ్‌ కమిటీని ఏర్పాటు చేసేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఈ నెల 22న కోల్‌కతాలో బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం కానుంది. అదే రోజు అక్కడి ఈడెన్‌ గార్డెన్స్‌లో ఈ సీజన్‌ ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌ జరుగనుంది. ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తలపడుతుంది. 

ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందే బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ ఆర్గనైజింగ్‌ కమిటీపై కసరత్తు పూర్తి చేయనుంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పొగాకు, మద్యం ఉత్పాదనలకు సంబంధించిన ప్రకటనలు క్రికెట్‌ మైదానంలో నిషేధం, క్రిప్టో కరెన్సీపై గట్టి నిర్ణయం కూడా తీసుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్‌లో వన్డే మెగా ఈవెంట్‌ జరగాల్సి ఉంది. ఈ కౌన్సిల్‌ అజెండాలో కమిటీ ఏర్పాటుతో పాటు మెగా ఈవెంట్‌ వేదికలపై కూడా చర్చించనున్నట్లు తెలిసింది. 

దీంతో పాటు 2025–26 దేశవాళీ సీజన్‌ షెడ్యూల్‌ను ఖరారు చేస్తారని, అలాగే భారత పర్యటనకు వచ్చే వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలతో ద్వైపాక్షిక సిరీస్‌ వేదికలపై కూడా అపెక్స్‌ కౌన్సిల్‌ చర్చించే అవకాశముందని బోర్డు వర్గాలు తెలిపాయి. పొగాకు, మద్యం ప్రకటనలపై ఇదివరకే ఐపీఎల్‌ సీజన్‌లో విధించిన నిషేధాన్ని బోర్డు అమలు చేయనుంది. 

టీమిండియా పురుషుల జట్టు వన్డే వరల్డ్‌కప్‌ను రెండుసార్లు గెలిచినప్పటికీ... భారత మహిళల జట్టుకు మాత్రం ఆ ‘కప్‌’ అందని ద్రాక్షే అయ్యింది. ఫైనల్‌ చేరిన రెండు సార్లు కూడా అమ్మాయిల జట్టు రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన కనీసం ఈ ఏడాదైన సొంతగడ్డపై ప్రపంచకప్‌ గెలిచి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతుందో చూడాలి!  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)