న్యూజిలాండ్ పర్యటనకు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం

Published on Tue, 07/07/2026 - 12:27

త్వరలో (అక్టోబర్‌ 22 నుండి డిసెంబర్‌ 1) న్యూజిలాండ్‌లో జరుగబోయే మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రణాళికను సిద్ధం చేసింది. సీనియర్ జట్టు పర్యటనకు ముందే 'ఏ' జట్టును న్యూజిలాండ్‌కు పంపించాలని నిర్ణయించింది. 'ఏ' జట్టులో కొందరు కీలక టెస్టు జట్టు సభ్యులను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. వారికి న్యూజిలాండ్ పరిస్థితుల్లో వీలైనంత మ్యాచ్ ప్రాక్టీస్ అందించాలన్నదే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం.  

ప్రస్తుతం భారత టెస్టు బ్యాటర్లలో రిషభ్ పంత్ మినహా శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ తదితరులు న్యూజిలాండ్‌లో టెస్టు అనుభవం చాలా తక్కువగా లేదా అసలు లేదు. అక్కడ స్వింగ్, సీమ్‌కు అనుకూలించే పిచ్‌లపై ముందుగానే ఆడడం ద్వారా వారు పరిస్థితులను అర్థం చేసుకుని మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉంటుంది.

న్యూజిలాండ్ పిచ్‌లపై బంతి ఎక్కువగా స్వింగ్ అవుతుండటంతో విదేశీ బ్యాటర్లకు పరుగులు చేయడం ఎప్పుడూ సవాలుగానే ఉంటుంది. అందుకే సీనియర్ ఆటగాళ్లను కూడా ఇండియా-ఏ జట్టులో చేర్చి ముందుగానే అక్కడికి పంపాలని బీసీసీఐ యోచిస్తోంది. ఈ పర్యటనలో ఇండియా-ఏ జట్టు మూడు లిస్ట్-ఏ మ్యాచ్‌లు, రెండు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులతో కూడిన మల్టీ ఫార్మాట్ సిరీస్ జరగనుంది. ఇందులో వన్డే సిరీస్ 2027 ప్రపంచకప్‌కు జట్టు కూర్పును ఖరారు చేయడంలో ఉపయోగపడనుండగా, రెండు టెస్టులు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 ఫైనల్ అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

 

Videos

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)