బెంగళూరు తొక్కిసలాట ఎఫెక్ట్‌.. విజయోత్సవాలకు బీసీసీఐ సరికొత్త నిబంధనలు

Published on Sun, 06/22/2025 - 12:47

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఆర్సీబీ విజయోత్సవ సంబరాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఆర్సీబీ విన్నింగ్ సెలబ్రేషన్స్  సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు.

ఈ క్రమంలో భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండడానికి భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) కఠిన నియమాలను తీసుకురానుంది. ఇకపై విన్నింగ్ సెలబ్రేషన్స్, సత్కార కార్యక్రమాలు సురక్షితంగా జరిగేలా భద్రతా నియమాలను రూపొందించడానికి బీసీసీఐ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ధ్రువీకరించారు.


బీసీసీఐ ప్రతిపాదించిన గైడ్‌లైన్స్ ఇవే..
👉కూలింగ్-ఆఫ్ పీరియడ్: ఏ జట్టు అయినా టైటిల్ గెలిచిన తర్వాత మూడు, నాలుగు రోజుల్లోపు వేడుకలు నిర్వహించడానికి అనుమతి నిరాకరణ.

👉బీసీసీఐ క్లియరెన్స్ తప్పని సరి: జట్లు ఏదైనా వేడుకను నిర్వహించే ముందు బీసీసీఐ నుంచి కచ్చితంగా అనుమతి తీసు​కోవాలి.

👉బోర్డు నుండి లిఖిత పూర్వకంగా అనుమతి లేకుండా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు.

👉భద్రతా బ్లూప్రింట్‌ను ముందే సమర్పించాలి. ఫైవ్ టైర్ సెక్యూరిటీ కచ్చితంగా ఉండాలి.

👉విమానాశ్రయం నుండి కార్యక్రం జరిగే వేదిక వరకు జట్టు వెళ్లే మార్గమంతా భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలి.

👉ఈవెంట్ షెడ్యూల్ అంతటా ఆటగాళ్లు, సిబ్బందికి పూర్తి రక్షణ కల్పించడం.

👉జిల్లా పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక అధికారుల నుండి అనుమతి పొందాలి.
 

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)